Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికాను కుదిపేస్తున్న దొంగతనం.. అధ్యక్షుడిపైనే అనుమానం..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 9:32 AM GMT
దక్షిణాఫ్రికాను కుదిపేస్తున్న దొంగతనం.. అధ్యక్షుడిపైనే అనుమానం..!
X
దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఇంట్లో జరిగిన దొంగతనం ఏకంగా దేశాన్ని కుదిపేస్తోంది. అవినీతి నిర్మూలిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సిరిల్ రామసోఫా తన ఇంట్లో వెలుగు చూసిన దొంగతనం కారణంగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే ఆయన అధ్యక్ష పదవికి ఎసరు వచ్చేలా కన్పిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాకు లింపూపూ ప్రావిన్స్ లో ఫలాఫలా వైల్డ్ లైఫ్ పామ్ ఉంది. ఈ ఫామ్ హౌస్ లోని ఫర్నీచర్ లో లక్షల డాలర్లను ఆయన దాచిపెట్టగా అక్కడ హౌస్ కీపర్ గా పని చేస్తున్న ఓ మహిళ తన సోదరుడికి విషయాన్ని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి నలుగురు నమీబియా వాసులతో కలిసి గ్యాంగ్ ఏర్పడి దొంగతనానికి స్కెచ్ వేశారు.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామ సోఫా విదేశాల్లో ఉన్న సమయంలో దొంగల ముఠా దొంగతానికి పాల్పడ్డారు. ఫామ్ హౌస్ లోకి రావడానికి హౌస్ కీపర్ సహకరించడంతో ఆ ముఠా పని ఈజీ అయింది. ఈ విషయం అధ్యక్షుడికి తెలియడంతో ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ పోలీస్ సిబ్బందిని దొంగలను పట్టుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే హౌస్ కీపర్.. అతడి సోదరుడికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కొంత సొమ్ము రికవరీ చేశారు.

అయితే దొంగతనం విషయం బయటికి ఎవరి తెలియకుండా ఉండేందుకు గాను అధ్యక్షుడే తిరిగి వారికి కొంత డబ్బు చెల్లించారు. అయితే కొంతకాలంగా దేశాధ్యక్షుడికి నమ్మిన బంటుగా ఉంటున్న సౌత్ ఆఫ్రికన్ స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్ ఫ్రాసెర్ కు ఆయనకు మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దొంగతనానికి సంబంధించిన విషయాలపై ఆర్థర్ జోహన్ బర్గ్ పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

రామసోఫాపై కిడ్నాప్.. లంచాలు.. మనీ లాండరింగ్ సహా నాలుగు మిలియన్ డాలర్లకు సంబంధించిన నేరాలకు సంబంధించిన ఆరోపణలను ఆర్థర్ చేశారు. దీంతో ఆ దేశంలోని ప్రివెన్షన్ అండ్ కాంబాట్ కరెప్ట్ యాక్టివిటీస్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడి ప్రతినిధి ఫలాఫలా ఫామ్ హౌస్ లో దొంగతనం జరిగిందనే విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో రామఫోసాపై దర్యాప్తు మొదలైంది.

అయితే విచారణలో మాత్రం రామఫోసా తనకు అంత డబ్బు పశువుల విక్రయాలతో వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదేశ అధ్యక్షుడిపై ప్రతిపక్ష పార్టీలు గట్టిగా గళం విప్పుతున్నాయి. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నాయి.

ప్రతిపక్షాలకు ఆయన్ని పదవి నుంచి తొలగించే బలం లేదు. మరోవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని అక్రమంగా కలిగి ఉండటం దక్షిణాఫ్రికాలో నేరంగా పరిగణిస్తారు. దీంతో ఆయన తన పదవీ రాజీనామా చేసిన మరొకరిని ఆ పదవీ కూర్చోబెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా దేశాధ్యక్షుడి ఇంట్లో వెలుగు చూసిన దొంగతనం విచిత్రంగా ఆయన మెడకే చుట్టుకోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.