Begin typing your search above and press return to search.
వీళ్ల నవ్వులు.. ప్రపంచాన్నే ఏడిపించాయి
By: Tupaki Desk | 22 Feb 2020 1:30 AM GMTసిరియా.. అదో భూలోక నరకం.. మానవహక్కులే లేని అధమ ప్రాంతం.. ఆడవాళ్లు ఆటబొమ్మల్లా.. పసివాళ్లు పండుటాకుల్లా రాలిపోతున్నా వైనం.. మనుషులను పిట్లల్లా బాంబులు, తుపాకులతో కాల్చేస్తున్న దైన్యం.. మిత్రపక్ష దేశాలతో కలిసి ప్రభుత్వ మద్దతు సైన్యం ఒకవైపు, వ్యతిరేఖ ఐసిస్ ఉగ్రవాద సైన్యం మరోవైపు సిరియాపై ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. మరో వైపు పౌరులు కూడా తమకు స్వేచ్ఛ కోసం తుపాకీలు పట్టారు. ఇలా మూడు వైపులా అంతర్యుద్ధంతో సిరియాలో మారణహోమం కొనసాగుతోంది. అమాయకులు బలి అవుతున్నారు..
ఎలాగోలా బతికి బట్టకట్టిన వారు సురక్షిత ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలసవాదులుగా తరలుతున్నారు. కానీ అక్కడ మహిళలకు, యువతులకు కామాంధుల రూపంలో వేధింపులు తప్పడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఐరాస వాలంటీర్లు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సిరియాలోని యుద్ధ ప్రాంతాలకు చేరుకోవడం కష్టతరం కాబట్టి.. మధ్యవర్తులు, అధికారుల ద్వారా తిండి, నిత్యావసరాలు అందిస్తున్నారు.
కొంతమంది అధికారులు అభాగ్యుల పరిస్థితి చూసైనా కనికరం లేకుండా వారికి సహాయ సహకారం అందించకుండా వారిని లైంగికంగా వేధిస్తున్నారట.. రాత్రి కోరిక తీరిస్తే తప్ప వారికి ఆహార పదార్థాలను అందించడం లేదట.. కోరిక తీర్చలేదంటే మాత్రం వారిక ఆకలితో పస్తుండాల్సిందే. అందుకే చాలా మంది యువతులు, మహిళలు శరాణార్థుల శిబిరాల నుండి ఆహారం సరఫరా చేసే కేంద్రాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారట.. ఈ విషయం ఐరాస దృష్టికి వచ్చిందని.. దానికి చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు ఐరాస ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ ఓ చిన్నారి నవ్వు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. బాంబులు, తుపాకుల శబ్ధాలకు భయపడిపోతున్న చిన్నారికి అవి దీపావళి టపాసుల శబ్ధాలు అని.. బాంబు పేలిన ప్రతీసారి గట్టిగా నవ్వుదామని ఆ తండ్రి బుజ్జాయికి భరోసా ఇచ్చాడు. ఇంటి పక్కన బాంబు పేలినా.. విమానం నుంచి బాంబు జారవిడిచినా.. తుపాకీ శబ్ధం పేలిన ఆ చిన్నారి బాలిక తండ్రికి చెబుతూ నవ్వుతోంది. కూతురు భయం పోగొట్టడానికి తండ్రి కూడా అవి దీపావళి బాంబులేనంటూ నవ్వుతున్నాడు. ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. సిరియాలో అంపశయ్య బతుకుతున్న మనుషుల దీన స్థితి కళ్లకు కట్టింది ఈ వీడియో..
ప్రాణభయం ఉన్నా.. ఎప్పుడూ మరణిస్తామో తెలియని పరిస్థితిలో ఉన్నా.. మృత్యువు కబలిస్తున్నా తన కూతురు మోములో ఆనందాన్ని వెతుక్కుంటూ నవ్వుతున్న ఈ తండ్రి వీడియో ప్రపంచాన్నే కంటతడి పెట్టిస్తోంది.. కన్నీరు కార్చేలా చేస్తోంది. సిరియాలోని దుర్భర పరిస్థితిని కళ్లకు కడుతోంది.