Begin typing your search above and press return to search.

నిజాం మ్యూజియం దొపిడీ దొంగల అరెస్ట్

By:  Tupaki Desk   |   11 Sept 2018 4:03 PM IST
నిజాం మ్యూజియం దొపిడీ దొంగల అరెస్ట్
X
కొద్దిరోజుల క్రితం ప్రఖ్యాత నిజాం మ్యూజియం నుంచి బంగారు టిఫిన్ బాక్సులు, ప్రాచీన వస్తువులను కాజేసిన దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.

దొంగలు ఏడవ నిజాంకు చెందిన ఒక బంగారపు టిఫిన్ బాక్స్ ను, వజ్రవైడూర్యాలు, రత్నాలు పొదిగిన కప్పులు, సాసర్లు, స్పూన్లను దొంగలు చాకచక్యంగా ఎత్తుకెల్లిన సంగతి తెలిసిందే.. ఇక్కడ దోపిడీ చేసి ముంబైకి పారిపోయారు. అక్కడ ఓ విలాసవంతమైన హోటల్ లో గదిని తీసుకొని గడిపినట్లు పోలీసులు తెలిపారు.

దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట ప్రారంభించారు. బంగారం టిఫిన్ బాక్సులో రోజూ దొంగలు భోజనం చేశారని పోలీసులు వెల్లడించారు. వారు దోచుకున్న అన్ని వస్తువులను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ బంగారు వస్తువులను రికవరీ చేయాల్సిందిగా ఏడవ నిజాం మనవడు నవాజ్ నజఫ్ అలీఖాన్ గత వారమే పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కు లేఖ రాశారు. ఈ మ్యూజియంలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఉన్నట్టు తెలిపారు. మ్యూజియంలో ఉంచిన ఎన్నో విలువైన వజ్రాలు, రత్నాలు పొగిడిన వస్తువులు ఉన్నాయని రక్షణ కల్పించాలని ఆయన లేఖలో కోరారు.