Begin typing your search above and press return to search.
అప్పుడు బండ్ల ! ఇప్పుడు అరవింద్ ! అరే సాంబూ రాస్కో రా...
By: Tupaki Desk | 25 April 2022 3:49 AM GMTఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నాయి. అయినా కూడా మన నాయకులు మాత్రం ఇప్పటి నుంచి హడావుడి మొదలుపెట్టేరు. ఎన్నికల వేళ చేయాల్సినవి చెప్పాల్సినవి గట్టిగా అరవాల్సినవి అవసరాలు తీర్చాల్సినవి అన్నింటినీ ఇప్పటి నుంచే మొదలు పెట్టేరు. ఆ విధంగా ఆంధ్రాలోగిలో కానీ తెలంగాణ వాకిట కానీ పక్తు రాజకీయం నడుస్తోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై ఓ లెక్క అన్న డైలాగ్ ప్రకారం అరవింద్ కూడా మాట్లాడుతున్నారు. అరవింద్ కూడా గొడవలకు కాలు దువ్వుతున్నారు. అరవింద్ అంటే నిజామాబాద్ ఎంపీ.
అరవింద్ అంటే ధర్మపురి శ్రీనివాస్ అబ్బాయి.. అరవింద్ అంటే కేటీఆర్ తో సెల్ఫీ కోసం ఒక రోజు ఆరాట పడి మీడియాలో హైలెట్ అయిన వ్యక్తి కూడా.. ! ఏ విధంగా చూసుకున్నా వీళ్లంతా వ్యక్తిగత ప్రయోజనాలే పరమాధిగా రాజకీయం చేస్తున్నారు. పైకి ఒకటి లోపల ఒకటి అయినా నా తరమా ఈ నాటకమాపుట అన్న విధంగానే ఉన్నారు అని పెదవి విరుస్తున్నారు సంబంధిత విశ్లేషకులు మరియు విమర్శకులు.. మంది మెప్పు కోసం పెదవి దాటే మాట ఎలా ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు.. అయితే సానుభూతి రాజకీయాలు లేదా ఉద్రిక్తతలు రేపే మాటలు. ఇవి ఇవాళ రేపే కాదు ఎన్నడూ ఉంటాయి.. ఉండాలి కూడా !
నాయకులు మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలే వస్తాయి.ఆ విధంగా ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ ఓ చర్చ నడుస్తోంది. నాయకుల మాటలపైనే నడుస్తోంది. సంచలనం కోసం పాకులాడుతున్న నాయకుల మాటలపైనే చర్చ నడుస్తోంది. ఆ విధంగా ఒక సందర్భంలో బండ్ల గణేశ్ అనే సినీ నిర్మాత, ఫక్తు కాంగ్రెస్ అభిమాని చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తున్నాయి. ఏదేమయినప్పటికీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పిన మాటలు సంచలనాత్మకం అయ్యాయి. అవేంటో వాటి కథేంటో చూద్దాం.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం సాధ్యం కాని పని గెలిస్తే తాను గొంతు కోసుకుంటానని అన్నారు అరవింద్.. ఇవాళ ఓ సందర్భంలో మీడియా ఎదుట చేసిన ఈ వ్యాఖ్య పెను సంచలనాలకు తావిస్తోంది. గతంలో ఇదే విధంగా కొన్ని మాటలు చెప్పి తప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు తన మాటకు పదును పెడుతూ మాట్లాడేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు. అయినా తెలంగాణ వాకిట బీజేపీ ఇయ్యాలో రేపో పట్టు పెంచుకోదు అని నిర్థారణకు ఏమయినా వచ్చిన్రా లేదా అభద్రతతోనే ఇసుంటి మాటలు అంటున్నరా అన్నది కేసీఆర్ వర్గాల డౌటు. ఇక ఇలాంటి వ్యాఖ్యలు నాయకులెందుకు చేస్తారో కూడా చర్చించుకుని తీరాలి.
గతంలో కూడా కేసీఆర్ ముక్కు నేలకు రాసుకుంటా అనిఅన్నారు. అది ఉద్యమ కాలంలో చెల్లిన మాట. కానీ ఇప్పుడు ఉద్యమాలు లేవు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు కావస్తోంది. ఈ ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి చేయాల్సినంత చేసింది.అదే విధంగా అప్పులు తిప్పలు కూడా పడింది.అయినా జనంలో ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇష్టముందని కొంత తెలుస్తోంది. క్షేత్ర స్థాయి వివరం ప్రకారం.. మరి! బీజేపీ పై జనానికి ఆసక్తి లేదా అంటే ఉంది.
అది వ్యక్తులపై అభిమానమే తప్ప ఆ పార్టీ పై ఉన్న అభిమానం కాదు. రానున్న కాలంలో అటు ఆంధ్రాలో అయినా ఇటు తెలంగాణలో అయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం ఓ కల.. సాధ్యం కాని కలల చెంత నాయకులు ఉన్నారా ? ఏమో మరి ! అందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తమ పరువు తామే తీసుకుంటున్నారా ? గతంలో కేటీఆర్ కూడా ఇలానే అతి విశ్వాసంకు పోయి హుజురాబాద్ లోనూ దుబ్బాకలోనూ పరువు తీసుకున్నారు. ఇప్పుడు అరవింద వంతు వచ్చిందా అన్నదే ఓ సందిగ్ధం మరియు సందేహం కూడా !