Begin typing your search above and press return to search.
విచిత్రంగా అనిపించినా నిజం ఇదే.. అప్పుడు ఇప్పుడు సత్యమే సాక్షి
By: Tupaki Desk | 7 Dec 2019 4:59 AM GMTవినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. దిశను అత్యంత పాశవికంగా తగలబెట్టిన దుర్మార్గాన్ని చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చిన సత్యం గురించి అందరికి తెలిసిందే. రైతు అయిన సత్యం ప్రతి రోజూ తెల్లవారుజామునే పొలానికి వెళతారు. కొట్టంలో పాలుపితుక్కుని ఇంటికి వస్తుంటారు. రోజు చేసే పనిలో భాగంగా దిశను కాల్చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అనుకోకుండా సత్యం కంట పడింది. దిశ మంటల్లో కాలిపోతున్న వైనాన్ని చూసి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇవ్వటం.. ఆ తర్వాత బయటకు రావటం తెలిసిందే.
విచిత్రమైన విషయం ఏమంటే.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత.. హతమైన నలుగురిని తొలుత చూసింది కూడా సత్యమే. దిశను తగలెట్టిన రోజున ఉదయం ఐదు గంటల వేళలో పొలానికి వెళుతున్న వేళ.. మంటను చూసి చలి మంటగా భావించారు. తర్వాత ఏడు గంటల సమయంలోనూ ఇంకా కాలుతూ ఉన్న వైనాన్ని చూసి.. అనుమానం వచ్చి చూడగా.. అది దిశదిగా అర్థమై వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇక ఎన్ కౌంటర్ విషయానికి వస్తే.. ఎప్పటిలానే నిన్న (శుక్రవారం) ఉదయం ఐదు గంటలకు ఎప్పటిలానే కొట్టంలో పాలు పితికేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కొందరు పోలీసులు అతన్ని అటు రావొద్దని.. తర్వాత రమ్మని సత్యాన్ని తిప్పి పంపారు. తర్వాత ఆరు గంటలకు వచ్చిన అతను తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు.
తనకు ఎదురైన ఉదంతాన్ని తన సోదరుడు వెంకటయ్యకు చెప్పారు సత్యం. దిశను కాల్చేసిన ప్రాంతం.. తాజాగా ఆ నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ అయిన ప్రదేశం.. రెండూ తమ భూముల్లోనేనని చెబుతున్నారు వెంకటయ్య. తమకు 30 ఎకరాల పొలం ఉందని.. వరి.. టమోటా పంటలు పండిస్తామని చెబుతున్నారు. మొత్తానికి రెండు ఉదంతాలను తొలుత చూసింది సత్యమే కావటం గమనార్హం.