Begin typing your search above and press return to search.

ఆడవాళ్లను చేస్తే రేప్.. మరి మగాళ్లను ఆడవారు చేస్తే?

By:  Tupaki Desk   |   16 Jun 2020 7:00 AM IST
ఆడవాళ్లను చేస్తే రేప్.. మరి మగాళ్లను ఆడవారు చేస్తే?
X
అప్పట్లో అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ఒక కామెడీ సినిమాలో కోర్టు సీన్ అదీ.. ‘హీరో అల్లరి నరేశ్ ను ఒక కామంతో కదంతొక్కిన యంగ్ లేడి రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దానిపై నరేశ్ కేసు పెడితే కోర్టులో విచారణ.. ఆడ ఆమె రేప్ చేస్తే సుబ్బరంగా చేయించుకోక.. కేసు పెడుతావా అని అందరూ అల్లరి నరేశ్ ను తిడుతారు.. తానైతే రేప్ చేయించుకునేవాడినని లాయర్ కూడా సెటైర్ వేస్తాడు.. నువ్వసలు మగాడివేనా అని నరేశ్ ను ఎగతాళి చేస్తారు..’’ ఇలా ఆడవారిపై రేప్ చేస్తే కోర్టుకు వచ్చిన కేసులు చూసిన జనాలకు ఈ సినిమాలోని రివర్స్ సీన్ బాగా నచ్చేసింది. కానీ నిజంగానే బయట మగవారిపై ఆడవాళ్లు రేప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సమాజంలో అత్యాచారాలు, ఘోరాలు, దారుణాలు జరిగితే మహిళా సమాజం రోడ్డెక్కుతుంది.. ప్రపంచం బద్దలయ్యేలా నిరసన తెలుపుతుంది.. ఆడవాళ్లపై అత్యాచారం చేస్తే మన చట్టంలో కఠిన శిక్షలే పడుతాయి.

అయితే మగాళ్లపై ఆడవాళ్లు అత్యాచారం చేస్తే కేసులు, చట్టాలు, శిక్షల గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ ఇంగ్లండ్ లో మగవారిపై మహిళలు అత్యాచారం చేస్తే అది నేరం కిందకు రాదని ఇంగ్లండ్ చట్టాలు చెబుతున్నాయి.దీనికి వ్యతిరేకంగా ఇంగ్లండ్ రచయిత్రి, ప్రొఫెసర్ సియోభన్ వేర్ మగాళ్లకు మద్దతుగా పోరాడుతున్నారు.

లాంకాస్టర్ యూనివర్సిటీ లా స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ వేర్ తాజాగా 200 మంది పురుషుల నుంచి వివరాలు సేకరించారు. అందులో జాన్ అనే వ్యక్తిని అతడి భార్య సెక్స్ కోసం చాలా హింసించేదట.. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కోపంతో ఊగిపోయేదని.. సెక్స్ కావాలని బలవంతం చేసేదని.. కొట్టేదని అతడు వాపోయాడట.. మంచానికి చేతులు కాళ్లు కట్టేసి తనను కొడుతూ గట్టిగా అరుస్తూ సెక్స్ చేసుకునేదని అతడు తెలిపాడట..

గాయాలతో తాను ఆమె కోరిక తీర్చకపోతే వయాగ్రా టాబ్లెట్ లు, డ్రగ్స్ ఇచ్చి మరీ మరీ తన కోరిక తీర్చుకునేదని అతడు తన భార్య తనను చేసిన అత్యాచారాలపై కథలు కథలుగా డాక్టర్ వేర్ కు చెప్పుకున్నాడట.. ఇలా మరికొంతమంది మగాళ్లు కూడా తమ పార్ట్ నర్స్, భార్యలు తమపై ఎలా రేప్ చేశారో చెప్పుకున్నారు.

అయితే ఇలాంటి ఘటనలు బయటకు చెప్పడానికి ఇబ్బంది పడ్డామని.. మాట్లాడితే ఎవరూ నమ్మరని.. మాకే అవమానమని భావించి పురుషులు ఇలా అంటే నంపుసకులు అని అంటారని ఊరుకున్నామని సర్వేలో పాల్గొన్న మగాళ్లు డాక్టర్ వేర్ ఎదుట వాపోయారట..

సాధారణంగా మహిళలతో సెక్స్ అంటే పురుషులు పడిచస్తారు. పైగా ఆడవారికంటే ముందుగానే ప్రొసీడ్ అవుతారు. సమాజంలో మహిళలకంటే పురుషులు బలవంతులు. ఈ కారణంగానే మగాళ్లపై అత్యాచారాలు బయటకు రావడం లేదని డాక్టర్ రే తేల్చారు.