Begin typing your search above and press return to search.
స్వాతంత్ర్య సంగ్రామంలో మహిళామణులు
By: Tupaki Desk | 16 Aug 2020 1:30 AM GMTమనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులు.. స్వాతంత్ర్యం అంతా నాడు ప్రాణాలు తెగించి దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు పెట్టిన భిక్షనే. అయితే ఇందులో యోధులే కాదు.. మణులు కూడా ఉన్నారు.
నాడు బ్రిటీష్ అధికారుల తుపాకీ గుళ్లకు ప్రాణాలకు ఎదురొడ్డి.. అలుపెరగని పోరాటం చేసిన మహిళా మణులు ఎందరో ఉన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాదు.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీర నారీమణుల గురించి కూడా తెలుసుకుందాం.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తొలి ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. ఈమె తర్వాత అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ 1857లో తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. లక్నోను ఆక్రమించుకొని సవాల్ చేశారు.
*మేడమ్ బికాజీ కామా 1896లో ప్లేగు వ్యాధి బాధితులకు సాయం చేస్తూ స్వాతంత్ర్యోద్యమానికి జీవితాన్ని దారబోశారు. మానవ హక్కులకు, సమానత్వం సాధించుటకు కృషి చేశారు.
*జాతిపిత మహాత్మాగాంధీ భార్యగా.. రాజకీయ వేత్తగా.. పౌరహక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధురాలిగా కస్తూర్బాగాంధీ గుర్తింపు పొందారు.
*ఇక కమలా నెహ్రూ.. జవహర్ లాల్ నెహ్రూ భార్యగా సహాయ నిరాకరణ ఉద్యోగంలో పాల్గొని సత్తాచాటారు. మహిళా బృందాలను సంఘటితపరిచారు.
*భారత స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్ కు చెందిన ఈ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
*పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మీపండిట్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశేషమైన కృషి చేశారు. కేబినెట్ పదవి పొందిన తొలి భారతీయ మహిళ
*తెలుగు వనిత దుర్గాభాయ్ దేశ్ ముఖ్. గాంధీజీ అనుచరురాలు అయిన ఈమె ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం పోరాడారు.
*సుచేత కృపాలనీ
మహాత్మాగాంధీతో కలిసి పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపాలనీ.. భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
*అరుణా అసఫ్ అలీ
స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని భారతరత్న బిరుదు పొందారు. అరుణా అసఫ్ అలీ. అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు.