Begin typing your search above and press return to search.
అప్పుడు అమ్మ-ఇప్పుడు అన్న.. కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే!
By: Tupaki Desk | 7 Dec 2022 4:41 AM GMTరాజకీయాల్లో నేతలు వ్యవహరించే తీరు ఆసక్తిగా ఉంటుంది. అంతకు మించి ఆశ్చర్యంగాను ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 'జగనన్న' సర్కారుపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ ఆశలు తీరుతున్నాయా? లేదా.. అనేది పక్కన పెడితే.. ప్రజల్లోకి అన్న వస్తుంటే మాత్రం బారికేడ్లుపెట్టి మరీ బంధిస్తున్నారు.
ఇక, జగన్ టూర్ అంటే.. ప్రజలు రెండు రోజుల ముందు నుంచే అష్టదిగ్భంధనంలోకి వెళ్లిపోతున్నారు. జిల్లాలా.. నగరాలా.. గ్రామాలా.. అనే తేడా లేదు. జగనన్న వస్తున్నారంటే.. చాలు ముందు బారికేడ్లు వస్తా యి.. తర్వాత పోలీసులు వస్తున్నారు. ఆ తర్వాతే.. జగన్ వస్తున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కట్ చేస్తే.. ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున వస్తోంది.
ప్రజల నుంచి విమర్శలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. అయితే, ఇక్కడ ఒక విషయం చెప్పుకొవాలి. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత కూడా ఇంతే భద్రతను ఏర్పాటు చేసుకునే వారు. ఆమెను అక్కడి ప్రజలు అమ్మగా పిలిచిన విషయం తెలిసిందే. అయితే, అమ్మ కూడా .. ఇలానే సేమ్ టు సేమ్.. పక్కా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
అమ్మ వస్తోందంటే.. ముందు బారికేడ్లు..తర్వాత పోలీసులు.. సేమ్ టు సేమ్ అన్నమాట. ఎక్కడ పర్యటించినా.. హై సెక్యూరిటీ. అమ్మను కలవాలంటే సామాన్యులకే కాదు.. పార్టీ ఎంపీలకు కూడా హడల్. అసలు అప్పాయింట్‌మెంట్ అడిగేందుకు కూడా జంకిన సందర్భాలు ఉన్నాయి. ఇక, ఇప్పుడున్న పరిస్థితిని చూస్తున్న కొందరు పాతతరం నాయకులు, ప్రజలు గత అమ్మ సంగతులు గుర్తు చేసుకుని.. సేమ్ టు సేమ్ అంటున్నారు.
కొసమెరుపు ఏంటంటే.. అమ్మ ముందు ఎవరూ నిలబడేవారు.. సొంత పార్టీ నేతలు కూడా! నడుం వరకూ శరీరాన్ని వంచుకుని.. లేదా.. బస్ట్ వరకైనా వంగి దండాలు పెడుతూ.. ఉండేవారు. అయితే.. ఏపీలో ఇదొక్కటిమాత్రం తక్కువ! అయితే, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. ఈ సీన్ కూడా చూడొచ్చని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.