Begin typing your search above and press return to search.
ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ ఫ్రెండ్లీ రూల్స్ ఉన్నాయి : మస్క్
By: Tupaki Desk | 30 May 2022 3:30 AM GMTప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అప్పట్నుంచి ఆ సంస్థలోని లోటుపాట్లను సరిదిద్దడం మొదలు పెట్టారు. ట్విట్టర్ లో పెను మార్పులు తీసుకొచ్చి యూజర్ ఫ్రెండ్లీ చేయడమే కాకుండా తన సంస్థ లాభాల బాట పట్టేలా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్, ప్రభుత్వ ఖాతా వినియోగదారుల నుంచి డబ్బు వసూల్ చేయాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్విట్టర్ లో అడిగిన ప్రశ్న తో ఆలోచనలో పడ్డ మస్క్.. దానికి సంబంధించిన వివరాలు సేకరించి అతడికి సమాధానం చెప్పారు. ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నేంటంటే..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎల్లప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కు అందుబాటులో ఉంటారు. అప్పుడప్పుడు నాటీ ట్వీట్స్ చేయడమే కాదు.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానం ఇచ్చేస్తుంటారు. అయితే ఈ సారి ఓ నెటిజన్ తాజాగా మస్క్ కొనుగోలు చేసిన ట్విట్టర్ గురించి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ లోని సాంకేతిక పరిమితుల గురించి ఖాతాదారులకు తెలియజేయాలని కొన్ని లోపాలను తెలియజేస్తూ నెటిజన్ మస్క్ కు ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్పై స్పందించిన మస్క్ వెంటనే ట్విటర్ లో స్పామ్, ఫేక్ అకౌంట్ల సంఖ్యపై ఫోకస్ పెట్టారు. కేవలం 5 శాతం మాత్రమే ఫేక్ అకౌంట్లు ఉన్నాయని ట్విట్టర్ చెబుతున్నా.. పూర్తి వివరాలు చెప్పాలని మస్క్ పట్టుబట్టారు. నెటిజన్ ట్వీట్ పై స్పందిస్తూ ప్రస్తుతం ఫేక్ అకౌంట్ ఫ్రెండ్లీ రూల్స్ ఉన్నాయంటూ మస్క్ ట్వీట్ చేశారు.
మరోవైపు ఇటీవలే భారత్లో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేయాలంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో టెస్లా ప్లాంట్ స్థాపించే ఆలోచన లేదని మస్క్ తెలిపారు. తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చెబుతూ వచ్చారు.
దీంతో పాటు ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే మస్క్ డిమాండ్లకు అంగీకరించని కేంద్రం.. కార్ల తయారీని భారత్లోని చేపట్టాలని స్పష్టం చేయడం వల్ల టెస్లా ను ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
మరోవైపు స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు మాత్రం భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీనికి భారత ప్రభుత్వం అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం అనుమతే ఆలస్యమని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మస్క్.