Begin typing your search above and press return to search.
ఆ దేశంలో ప్రేమికుల కోసం గంటచొప్పున గదులు ఇస్తారట
By: Tupaki Desk | 1 Feb 2022 3:49 AM GMTఅవును..ఆ దేశంలో ప్రేమికులకు గదుల్నిగంట చొప్పున అద్దెకు ఇస్తున్న ట్రెండ్ ఈ మధ్యన ఎక్కువైంది. ఆరుబయట తమ ప్రేమను ప్రదర్శించుకోవటం కోసం ఇబ్బంది పడే వారి కోసం పెద్ద ఎత్తున ప్రైవసీ ఏర్పాట్లను ఇందులో చేయటం గమనార్హం. సన్నిహితంగా ఉండేందుకు.. తాము కోరుకున్నట్లుగా ఉండేందుకు వీలుగా.. ఈ గదుల్ని సిద్ధం చేశారట. ఇంతకూ ఆ దేశం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. దక్షిణ కొరియా.
ఇప్పుడా దేశంలోలవ్ మోటల్స్ పేరుతో అనేక హోటల్స్ వెలుస్తున్నాయి. ప్రేమికులు ఎప్పుడైనా.. ఏ సమయంలో అయినా ఈ మోటల్స్ కు వచ్చి.. గంటకు అద్దెకు తీసుకోవచ్చు. అలా అద్దెకు తీసుకున్న వారిని ఎవరూ డిస్ట్రబ్ చేయరని చెబుతున్నారు. అయితే.. ఈ గదుల్ని ప్రేమికులకు మాత్రమే కాదు.. ఆ దేశంలో పర్యటించే వారి కోసం కూడా అద్దెకు ఇస్తారట. కేవలం గంటకు కూడా అద్దెకు ఇవ్వటం వల్ల.. స్వల్ప విరామం కోసం అద్దెకు తీసుకోవాలంటే.. డబ్బులు ఆదా చేయొచ్చని చెబుతున్నారు.
ఇంతకీ ఈ లవ్ హోటల్స్ కు కారణం.. అక్కడ అనుసరించే కల్చర్ గా చెబుతున్నారు. మన దేశంలో మాదిరి బహిరంగంగా అమ్మాయి.. అబ్బాయిలు సన్నిహితంగా ఉండటాన్ని అక్కడి వారు ఆమోదించరు. ప్రాశ్చాత్య దేశాల్లో మాదిరి దక్షిణకొరియాలో ఓపెన్ రొమాన్సుకు అవకాశం ఉండదు. కొన్ని దేశాల్లో ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటారు.
కానీ.. దక్షిణ కొరియాలో మాత్రం అలాంటివేమీ సాధ్యం కావని చెబుతున్నారు. అక్కడి సంప్రదాయాల ప్రకారం.. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకోవటాన్ని అక్కడి వారు అంగీకరించరు. పెద్దలైతే అదో తప్పుగా భావిస్తారు. అయితే.. లైంగిక స్వేచ్ఛను కోరుకునే కొరియన్ సమాజం అందుకు భిన్నమైన అభిరుచి పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ లవ్ హోటల్స్ కాన్సెప్టునుకు ఆదరణ పెరిగినట్లు చెబుతారు. దీనికి తోడు దక్షిణ కొరియాలో చిన్న ఇళ్లలో ఉండటం.. తల్లిదండ్రులతో ఉండటంతో తమ మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపటానికి ఈ లవ్ మోటెల్స్ ను ఏర్పాటు చేశారని చెబుతారు. దీనికి తోడు ఏకాంతంగా కలవటానికి వీలుగా ఉండే ప్రదేశాలు లేకపోవటం కూడా ఈ మోటెల్స్ రావటానికి కారణంగా చెప్పొచ్చు.
అయితే.. ఈ మోటెల్స్ విశాలంగా.. భారీగా ఉండవని చెబుతారు. మన దగ్గర లాడ్జీల మాదిరే చిన్నవిగా ఉంటాయి కానీ.. అందంగా.. ఆకర్షణీయంగా అలంకరిస్తారు. దీనికి తోడు ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో యువత వీటిలో స్టే చేసేందుకు ఆసక్తిని చూపిస్తారని చెబుతారు.