Begin typing your search above and press return to search.

అక్కడ బీజేపీ.. ఇక్కడ కారు.. గ్యారెంటీ

By:  Tupaki Desk   |   22 Oct 2019 4:37 AM GMT
అక్కడ బీజేపీ.. ఇక్కడ కారు.. గ్యారెంటీ
X
మహారాష్ట్ర, హర్యాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే హవా అని తేలింది.. ఇక తెలంగాణలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగిందని స్పష్టమైంది. నిన్న సాయంత్రం ఎన్నికలు ముగిశాక దేశంలోని ప్రముఖ న్యూస్ చానెళ్లు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఇందులో మహారాష్ట్రలో బీజేపీ 200 పైనే అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని స్పష్టం చేశాయి. ఇక హరియాణాలోనూ భారీ విజయమే దక్కుతుందని అంచనావేశాయి.

*మహారాష్ట్రలో కమల వికాసం

ఒక్క ఇండియా టుడే తప్ప మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి మొత్తం రాష్ట్రంలో ఉన్న 288 సీట్లకు గాను 200-240 స్థానాల్లో విజయం సాధిస్తాయని వెల్లడించాయి. పూర్తి మెజారిటీ సాధిస్తాయని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ కేవలం 20-40 సీట్లలోపే పరిమితమవుతుందని తేల్చాయి.

*హర్యానాలోనూ కమలమే..

ఇక ఉత్తరాన ఉన్న హర్యానా రాష్ట్రంలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ ఒక్కటే 70కు పైగా సాధిస్తాయని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఇక్కడ మేజిక్ మార్క్ 46. కాంగ్రెస్ 20-30కే పరిమితం అవుతుందని తేల్చాయి.

*కాంగ్రెస్ గల్లంతే

రెండోసారి అఖండ మెజార్టీ సాధించిన బీజేపీకి మహారాష్ట్ర, హర్యానా ప్రజలు పట్టం కట్టబోతున్నారని తేలింది. ఇక కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కమలసేనకు కకావికలం కావడం ఖాయమని తేల్చాయి.

*హుజూర్ నగర్ కారుదే..

తెలంగాణలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంచనావేశాయి. టీఆర్ఎస్ కు దాదాపు 50శాతానికి పైగా ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్ 40శాతం వస్తాయని అంచనావేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత , ఉత్తమ్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ నేతలు మోహరించిన అదికార టీఆర్ఎస్ పోల్ మెనేజ్ మెంట్ ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయని తెలిసింది. ఏకంగా 700 మంది నాయకుల సైన్యం 15 రోజుల పాటు ప్రతి ఓటరును పలకరించి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, చివరి రెండు రోజుల్లో తిరుగులేని పోల్ మేనేజ్ మెంట్ వల్ల గులాబీ పార్టీ విజయం సాధిస్తోందని తెలిపాయి.


* మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవీ..

సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు
న్యూస్ 18 243 41 4
టైమ్స్ నౌ 230 48 10
ఇండియా టుడే 166-194 72-90 22-34
రిపబ్లిక్ టీవీ 216-230 52-59 8-12
ఏబీపీ -సీఓటర్ 192-216 55-81 4-21
టీవీ9-సిసిరో 197 75 16
న్యూస్ ఎక్స్ 188-200 74-89 6-10
---------------------------
సగటు చూస్తే 210 64 13


* హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవీ..

సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు

న్యూస్ 18 75 10 01
టైమ్స్ నౌ 71 11 8
ఇండియా న్యూస్ 75-80 9-12 1
రిపబ్లిక్ టీవీ 57 17 16
ఏబీపీ -సీఓటర్ 72 8 10
టీవీ9-సిసిరో 47 23 20
న్యూస్ ఎక్స్ 77 11 2
---------------------------
సరాసరి 68 13 10