Begin typing your search above and press return to search.

ఏపీలో పీకే రిపోర్ట్ తేడా ఉంది.. కాబ‌ట్టేనా.. వైసీపీ వ‌ద్దు అంది!!

By:  Tupaki Desk   |   27 April 2022 1:30 PM GMT
ఏపీలో పీకే రిపోర్ట్ తేడా ఉంది.. కాబ‌ట్టేనా.. వైసీపీ వ‌ద్దు అంది!!
X
ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌- వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వీరిద్ద‌రిదీ.. రాజ‌కీయ పేగుబంధం అంటారు ప‌రి శీల‌కులు. 2016 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా నిరాఘాటంగా... ఈ బంధం కొన‌సాగింది. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ బంధం మ‌రింత ముడిప‌డుతుంద‌ని.. మ‌ళ్లీ జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు పీకే.. ప్ర‌య త్నాలు చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇంత‌లోనే.. ఈ బంధం పుటుక్కున తెగి పోయింది. కాదు కాదు. వైసీపీ అధినేత జ‌గ‌నే తెంచేసుకున్నార‌ని అంటున్నారు.

తాజాగా..వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. పీకేతో ప‌నిచేయ‌డం లేద‌ని.. ఆయ న అవ‌స‌రం కూడా ఇక త‌మ‌కు లేద‌ని.. చెప్పారు. అంటే.. ఇక‌, పీకేతో వైసీపీ క‌లిసి ప‌నిచేయ‌ద‌న్న‌మాట‌. దీంతో ఈ విష‌యంపై బ‌య‌ట ర‌క‌ర‌కాల చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా పీకేకు జ‌గ‌న్‌కు మ‌ధ్య వ‌చ్చిన విభేదాలు ఏంటి? ఎందుకు ఆయ‌న‌ను స‌డెన్‌గా ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ఫోక‌స్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే ముఖ్యంగా.. పీకే ఇచ్చిన ప్ర‌జెంటేష‌న్ లేదా నివేదిక‌.. జ‌గ‌న్‌కు నచ్చ‌లేద‌ని అంటున్నారు.

పీకే ప్ర‌జంటేష‌న్‌లో ఆయ‌న లేవ‌నెత్తిన ప్ర‌ధాన విష‌యం.. పార్టీలో కేడ‌ర్ బేస్ లేకుండా పోయింద‌ని.. కేడ ర్ను బ‌లోపేతం చేసుకోక‌పోతే.. ఇబ్బంది ఉంటుద‌ని.. ఒక‌రిపోర్టును ఇచ్చిన‌ట్టు తెలిసింది.

అదేస‌మ‌యం లో వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుబ‌ట్టిన‌ట్టు కూడా అంటున్నారు. అంటే.. వ‌లంటీర్ల మీద రాజ‌కీయం న‌డ‌వ‌దు.. అని గ‌ట్టిగానే చెప్పిన‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. అంటే... వ‌లంటీర్లు ప్ర‌భుత్వంలో భాగ‌మైతే.. కేడ‌ర్ పార్టీకి చాలా ముఖ్య‌మేన‌ది.. పీకే నివేదిక సారాంశంగా ఉంద‌ని తెలుస్తోంది.

అంతేకాదు.. 2019 ఎన్నిక‌ల్లో కేడ‌ర్‌ను త‌యారు చేశాము కాబ‌ట్టి.. ప్ర‌భంజ‌న విజ‌యం ద‌క్కింద‌ని.. ఇప్పుడు ఆ కేడ‌ర్ సైలెంట్ అయింద‌ని.. పీకే పేర్కొన్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు. కేడ‌ర్ ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ప‌డుతోంద‌ని.. కాబ‌ట్టి.. ప‌నిచేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. పీకే తేల్చి చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగు తోంది. అంతేకాదు.. కేడ‌ర్ కూడా త‌మ ఆలోచ‌న‌లు.. త‌మ‌క‌ష్టాలు వినాల‌ని కోరుకుంటోంద‌ని.. అప్పుడే వారు ప‌నిచేస్తామ‌ని కూడా తేల్చి చెబుతున్నార‌ని.. పీకే వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఇంతలా కుండ‌బ‌ద్ద‌లు కొట్టే స‌రికి.. పీకే ఇచ్చిన నివేదిక‌పై సీఎం జ‌గ‌న్ గుర్రుగా ఉన్నార‌ని.. అందుకే.. పీకేతో సంబంధాలు తెంపుకొన్నార‌ని.. అంటున్నారు. కార‌ణాలు ఏవైనా.. ఆక‌స్మికంగా.. పీకేను త‌ప్పిస్తున్న‌ట్టు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ కూడా పీకేను రిజెక్ట్ చేసిన రోజే.. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో.. వైసీపీ కూడా.. మాకు పీకే వ‌ద్దు.. ఆయ‌న సేవ‌లు.. చాలు... అంటూనే పీకేను ప‌క్క‌న పెట్టింది. దీంతో పీకే.. ఇప్పుడు త‌న‌దైన మార్కును పోగొట్టుకున్నాడా? అనేది చ‌ర్చ‌గా మారింది.