Begin typing your search above and press return to search.

రోడ్లపై ఇక ఫాస్టాగ్ కు కేంద్రం మంగళం

By:  Tupaki Desk   |   2 May 2022 6:40 AM GMT
రోడ్లపై ఇక ఫాస్టాగ్ కు కేంద్రం మంగళం
X
జాతీయ రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ ను అరికట్టడానికి.. టోల్ గేట్ ల వద్ద ఆగకుండా వెళ్లడానికి కేంద్రప్రభుత్వం ఈ ఫాస్టాగ్ తెచ్చింది. దీని వల్ల ప్రయాణికులు టోల్ గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండకుండా చేయవచ్చని దీన్ని ప్రవేవపెట్టింది. అయితే

ఫాస్టాగ్ కోసం ప్రతీ వాహనం అద్దెపై ఒక కోడ్ తో ముద్రించిన స్టిక్కర్ ముద్రిస్తారు. తద్వారా ఆ వాహనం ఎక్కడికి వెళ్లినా కోడ్ ఆధారంగా ఏం చేసినా దానిపై నిఘా ఉంచడానికి కేంద్రానికి వీలు చిక్కతుందట.. ఫాస్టాగ్ వల్ల స్మగ్లర్ల కదలికలను సులభంగా ట్రాక్ చేయవచ్చట.. అలాగే అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయవచ్చు. హింస, మోసాలకు పాల్పడిన వారు, నేరస్థులు, దొంగలు వాహనాల నంబర్ ప్లేట్, కార్ల రంగును మార్చినా కూడా ఫాస్టాగ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ వాహనాన్ని ఈజీగా పోలీసులు గుర్తించడానికి దోహదపడుతుంది. తప్పించుకోవడానికి వీల్లేకుండా ఫాస్టాగ్ మార్చబడదు. ఇది పోలీసులకు వాహనాలను ట్రాక్ చేయడానికి.. నేరస్థులను పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది.

అలాగే, వాహనాల కోసం నకిలీ బీమా క్లెయిమ్‌లు కూడా తొలగించబడతాయి. ఫాస్టాగ్ రికార్డింగ్‌ల ప్రకారం వాహనం వెళ్ళిన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. దాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడతాయి.

చందనం అక్రమ రవాణా ప్రబలంగా ఉన్న తమిళనాడులో ఫాస్టాగ్ వల్ల చాలా మేలు జరుగుతోంది. తమిళనాడులోని శివగంగలో పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడిన అనుమానాస్పద వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఇచ్చారు. ఈ వాహనాలను గుర్తించడానికి జాతీయ రహదారి అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ఇక బీమా చెల్లింపుల ఎగవేత కూడా ఫాస్టాగ్ తో పట్టుకోవచ్చని అధికారులు అంటున్నారు.

ఇలా ఫాస్టాగ్ తో ట్రాఫిక్ సమస్యలకే కాదు.. నేరస్థులు , స్మగ్లర్ల ఆటకట్టించడం.. బీమా కట్టించుకోవడం.. మోసాలు అరికట్టడం ద్వారా అన్ని పనులు ఒకేసారి చేయవచ్చని కేంద్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని తెచ్చినట్టు సమాచారం.

ఈ వ్యవస్త వల్ల వాహనదారులకూ వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద సంబంధిత నిర్వహణ సంస్థ టోల్ రోడ్ ప్రారంభం నుంచి ముగింపు దాకా కిలోమీటర్లను లెక్కగట్టి ట్యాక్స్ ను వసూలు చేస్తారు. అంటే వాహనదారుడు టోల్ రోడ్ ను 10 కి.మీలు వాడుకున్నా మొత్తం ట్యాక్స్ ను చెల్లిస్తున్నారు.ఈ పద్ధతితో వినియోగదారుడు నష్టపోతున్నాడు.

ఈ క్రమంలోనే జీపీఎస్ ఆధారంగా పనిచేసే జీఎన్ఎస్ఎస్ లో వాహనదారుడు టోల్ రోడ్ పై ప్రయాణించే దూరానికే టోల్ ట్యాక్స్ చెల్లించేలా నిబంధంనలు మారుస్తోంది.

ఉగ్రహాగాల ద్వారా జీపీఎస్ ను అంచనావేసి వారు ప్రయాణించిన దూరం వరకే పన్ను చెల్లించేలా కొత్త సవరణ తీసుకురాబోతున్నారు. ఎంత ఎక్కువ ధూరం ప్రయాణిస్తే.. తక్కువ ప్రయాణిస్తే జీపీఎస్ ఆధారంగా అంతే ట్యాక్స్ ను కట్టాలన్నమాట.. గతనెల 18న కేంద్ర రోడ్డు, రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని పార్లమెంట్ లో తెలిపాడు.

ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఈ జీఎన్ఎస్ఎస్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా కార్ల ట్రాకింగ్ చేసి పన్ను చెల్లించే పద్ధతి అమల్లో ఉంది. జర్మనీలో 98.8 శాతం వాహనాలు ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. దీని ప్రకారం టోల్రోడ్ పైకి వాహనం రాగానే ప్రయాణ టైమ్ లైన్ ప్రారంభమవుతుంది. ఆ వాహనం టోల్ రోడ్డు నుంచి దిగాక టైమ్ లైన్ పూర్తవుతుంది. ప్రయాణించిన కి.మీల లెక్కన బ్యాంకు ఖాతా నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఈ విధానంతో అటు ప్రయాణికుడికి భారం తగ్గి.. ప్రభుత్వానికి నేరుగా డబ్బులు జమ కావడంతో ఇరువురికి లబ్ధి చేకూరనుంది.