Begin typing your search above and press return to search.
35 వేల జనాభా ఉన్న మునిసిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ కి దిక్కులేదా...?
By: Tupaki Desk | 19 Dec 2022 12:30 PM GMTప్రకాశం జిల్లాలో ఉన్న ఒక మునిసిపాలిటీలో దాదాపుగా ముప్పయి అయిదు వేల జనాభా ఉంది. అయితే ఆ మునిసిపాలిటీలో గత రెండేళ్ళ నుంచి బ్లీచింగ్ పౌడర్ కూడా అందడం లేదు అని అంటున్నారు. అంతే కాదు ప్రజల కోసం ఒక్క వీధి లైట్ కూడా వేసిన పరిస్థితి లేదు అట . ఇక కాలువలను శుభ్రం చేయడానికి కూడా డబ్బులు లేవు అని అంటున్నారు.
ఇదీ వైసీపీ సర్కార్ లో జనాల పాట్లు అగచాట్లూ అని అంటున్నారు. ఏపీలో ఆ ఒక్క మునిసిపాలిటీయే కాదు, అన్ని చోట్లా అదే పరిస్థితి ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి . రెండేళ్ళ క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో నెగ్గారు. కానీ లాభమేంటి మునిసిపాలిటీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి అని అంటున్నారు . చాలా చోట్ల కనీస సదుపాయాలు లేవు.
రోడ్లు చూస్తే అధ్వాన్నంగా ఉన్నాయి. అన్ని విధాలుగా ప్రగతి గతి తప్పింది అని అంటున్నారు. మునిసిపాలిటీలు అంటే స్థానిక స్వపరిపాలనకు అద్దం పడతాయి. కానీ నెగ్గిన చైర్ పర్సన్స్ కి కూడా విధులు లేవు, నిధులు లేవు అని తెలుస్తుంది . దాంతో వారు పూర్తి నిరుత్సాహంగా ఉన్నారు అని అంటున్నారు . అన్ని విధాలుగా వారు ఏమీ కాకుండా అయిపోయామని బాధపడుతున్నరు అట .
పేరుకు అధికార పార్టీ, కానీ వైసీపీ ఏలుబడిలో స్థానిక సంస్థలకు నిధులు రావడం లేదు. అభివృద్ధికి డబ్బులు ఎక్కడా లేవు. దాంతో వీధులలో దీపాలు కూడా లేకుండా నెలల తరబడి కనిపిస్తోంది. మునిసిపాలిటీలలో పాలన అన్నది సాగుతోందా అంటే లేదు అనే అంటున్నారు. ప్రజలు ముఖ్యంగా స్థానిక సంస్థల నుంచి కోరుకునేది అపారిశుద్ధ్యాన్ని, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని, స్ట్రీట్ లైట్స్ బాగా ఉండాలని, రోడ్లు చక్కగా ఉండాలి.
కానీ వైసీపీ ఏలుబడిలో మూడున్నరేళ్ళ పాలనలో అసలు వీటికి దిక్కు లేదు. రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయని అంతా అనుకుంటున్నారు కానీ మునిసిపాలిటీలు మురికి కూపాలుగా మారిపోతున్నాయని ఇపుడు మొత్తుకుంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూసుకున్నా అనేక మునిసిపాలిటీలకు గతంలో స్థాయి పెంచారు. గ్రేడ్ పెంచారు. మరి వాటికి తగినట్లుగా స్పెషల్ గ్రాంట్స్ రిలీజ్ చేయాలి. అభివృడ్ధి పనులు జరగాలి. కానీ శానిటేషన్ విభాగమే చేష్టలుడిగి చూస్తోంది.
ఎవరికి ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేమన్న నీరసమైన సమాధానం వస్తోంది. ఇక కౌన్సిలర్లు అధికార పార్టీకి చెందిన వారు ఉన్నారు. వారు సైతం అభివృద్ధి మీద తీర్మానాలు ప్రవేశపెట్టి కౌన్సిల్ లో ఆమోదించుకోవడం తప్ప ఆ పనులు ఎపుడు మొదలవుతాయో చెప్పలేకపోతున్నారు. తాము ఉత్సవ విగ్రహాలుగానే మారిపోయామని బాధ పడుతున్న వారు ఉన్నారు.
ఇక అధికారులు సైతం నిధులు ఉంటే చేయమా అని అంటున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలీ అంటే స్థానిక పాలన పూర్తిగా స్తంభించింది. అభివృద్ధి కూడా ఆగిపోయింది. మునిసిపాలిటీలకు ఉన్న దర్జా దర్పం పూర్తిగా పక్కకు పోయాయి. ఏమీ లేని ఏమీ చేయలేని దైన్య స్థితిలోనే మునిసిపాలిటీలు ఉన్నాయని అంటున్నారు. ఒకనాడు కౌన్సిలర్ అంటే లోకల్ ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వారు సైతం ఇపుడు సైలెంట్ అయిపోయే పరిస్థితి.
మునిసిపాలిటీలను పరిపుష్టం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచన చేయడంలేదు. నిధులు విధులు లేకుండా తాము కుర్చీలకు అలంకారప్రాయంగా ఉన్నామని అంటున్నారు. పట్టణాలలో మునిసిపాలిటీలలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. అభివృద్ధి లేమి స్పష్టంగా ఉంది. మరి ఇది అధికార వైసీపీకి అతి పెద్ద విమర్శగా మచ్చగానే చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.