Begin typing your search above and press return to search.
రాజ్యాంగంలో రాజధాని అన్న పదం లేదా?
By: Tupaki Desk | 24 Jan 2020 5:41 AM GMTకొన్ని విషయాలు విన్నంతనే విపరీతమైన ఆసక్తిని.. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఈ కోవకే చెందుతాయి. నిజమే.. రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదు. దేశ రాజధాని.. రాష్ట్ర రాజధాని అన్న పదాలే లేవు. రాజధాని అంటే ఎలా ఉండాలి? ఏముంటేనే రాజధాని అవుతుంది లాంటి ప్రస్తావనే లేదు.
రాజ్యాంగాన్ని రాసే సమయానికి రాజధాని విషయంలో పెద్ద చర్చ లేకపోవటం.. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఏపీలో ఏర్పడినటువంటి క్లిష్టమైన పరిస్థితి అప్పటికి లేకపోవటం.. అలాంటివి ఏర్పడతాయన్న అంచనాలేని కారణంగానే ప్రస్తావించలేదని చెప్పాలి.
ఏ మాటకు ఆ మాటే.. పాలకులకు ఎక్కడి నుంచి నచ్చితే అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని నడుపుతున్న వైనాన్ని చూస్తున్నదే. విపత్తులు వచ్చినప్పుడు.. ఫలానా అన్న ప్రాంతంతో సంబంధం లేకుండా అధికార యంత్రాంగాన్ని నడపటం చూస్తుంటాం. ఎక్కడిదాకానా ఎందుకు? హుధూద్ తుపాన్ సమయంలో నాటి బాబు ప్రభుత్వం విశాఖ నుంచే పాలన సాగించిందన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే.. మంత్రివర్గం మొత్తాన్ని తన కలంపోటుతో తీసి పారేసిన ఆయన.. అసోం వెళ్లిపో్యి.. అక్కడినుంచి పాలన సాగించటాన్ని మర్చిపోలేం.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత అమ్మ జయలలిత ఊటీ నుంచి పాలన చేయటాన్ని మర్చిపోలేం కదా? ఎక్కడిదాకానో ఎందుకు? పక్కనున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్.. నిత్యం సెక్రటేరియట్ కు వెళ్లి పాలిస్తున్నారా? ఆయనకు సచివాలయం ఎందుకో నచ్చలేదు. అంతే.. ప్రగతిభవన్ లేదంటే ఫామ్ హౌస్ నుంచి ఏళ్లకు ఏళ్లుగా పాలించటం లేదా? ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఎక్కడ ఉంటే.. అక్కడి నుంచే పాలన సాగించే వీలున్నప్పుడు.. అమరావతిలోనే రాజధానిని ఉంచాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న. దీనికే బాబు అండ్ కో ఆగమాగం చేస్తున్నారన్నది మర్చిపోకూడదు. రాజధాని అన్న పదమే రాజ్యాంగంలో లేదన్న సీఎం జగన్ మాటలు చూస్తే.. సీఎంగా తాను తీసుకునే నిర్ణయాల్ని నిలువరించాలన్నదే లక్ష్యమైతే.. అలాంటి వ్యవస్థనే మార్చేయాలనుకోవటం జగన్ ది తప్పు అయితే కాదన్న అభిప్రాయం కలుగక మానదు.