Begin typing your search above and press return to search.

బాణసంచాపై సుప్రీంకోర్టు ఆంక్షలు

By:  Tupaki Desk   |   30 Oct 2021 5:46 AM GMT
బాణసంచాపై సుప్రీంకోర్టు ఆంక్షలు
X
బాణసంచా కాల్చడం పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి వేడుక ల్లో బాణాసంచా పై ఆంక్షలు విధించింది. బాణసంచా పై నిషేధం లేదని, బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌ పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. దీపావళి వేడుకల్లో బాణ సంచా కాల్చడం పై వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎంఆర్‌షా, సట్సి ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భం గా ధర్మాసనం కీలక నిర్ణయాలు తీసుకుంది. వేడుకల పేరుతో సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని తేల్చిచెప్పింది. భారత రాజ్యాంగం లోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తప్ప కుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రం గా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఉత్సవాల పేరు తో పర్యావరణానికి హానికరమైన బాణా సంచా కాల్చడానికి వీల్లేదని న్యాయ స్థానం స్పష్టం చేసింది. బాణ సంచా తయారీ, వినియోగం, నిషేధిత బాణసంచా అమ్మ కాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించి నా కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం హెచ్చరించింది.

పర్యావరణ హితాన్ని అనుసరించి గత కొన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టు దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం పై పలు పలు ఆంక్షలు విధిస్తోంది. రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలని గతంతో సూచించింది. బాణాసంచా పై నిషేధం విధించాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తయారీ దారుల ఉపాధి హక్కు తో పాటు ప్రజలు ఆరోగ్యం గా జీవించే హక్కు వంటి అనేక అంశాలను పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుందని గతం లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

దేశ వ్యాప్తం గా కాలుష్యం విపరీతం గా పెరగడంతో బాణా సంచా కాల్చడం పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాణ సంచా పేల్చడం వల్ల ప్రజల్లో శ్వాస కోశ వ్యాధులు తీవ్ర అనా రోగ్య పరిస్థితుల కు దారి తీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు బాణా సంచ ను నిషేదించాలని పర్యవరణవేత్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న తరుణం లో బాణా సంచా పేల్చడం వల్ల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.