Begin typing your search above and press return to search.
బ్రాండ్స్ పై ప్రభావం లేనట్లే..కోహ్లీ ప్రత్యేక ఇదే !
By: Tupaki Desk | 18 Sep 2021 10:30 AM GMTవిరాట్ కోహ్లీ .. క్రికెట్ ప్రపంచంలో ఓ మకుటం లేని మహారాజు. అందుకే ఎంతోమంది దిగ్గజాలు సైతం కోహ్లీ ఆటపై ప్రశంసలు కురిపిస్తుంటారు. గ్రౌండ్ లో ఆడేటప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. కోహ్లి అగ్రెసివ్ ఆటిట్యూడ్ తో పాటు ఆటనూ ఇష్టపడే యంగ్ జనరేషన్ కి అతని పట్ల ఉన్న అభిమానం ఎంతైనా ప్రత్యేకమే. అయితే తాజాగా పని భారం ఎక్కువగా ఉండటం తో అతి త్వరలో టీ20 కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పనున్నాడు. వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో రకరరకాల చర్చలు, కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
మరి కోహ్లి గనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. అతని బ్రాండ్‌కు వచ్చే నష్టమేమైనా ఉంటుందా, అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు. రకరకాల బ్రాండ్ లు. కోట్లలో వ్యాపారం కేవలం కోహ్లి బ్రాండ్ నే నమ్ముకుని నడుస్తున్నాయి. అందుకు ప్రతిగా పారితోషకం సైతం కోహ్లికి భారీగానే ముట్టజెప్పుతున్నారు. మరి క్రికెట్ వ్యూయర్ షిప్ ను శాసిస్తూ, ఊహకందని రీతిలో బిజినెస్ చేస్తున్న పొట్టిఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటే అది ప్రచారాలపై, కోహ్లి ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టవా అసలు ఆ ఆలోచననే దరి చేరనీయట్లేదట సదరు కంపెనీలు.
క్రికెట్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కోహ్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు. ఎమ్ ఆర్ ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, పూమా, వోలిని, అడీ, ఉబెర్ ఇండియా, రాయల్ ఛాలెంజ్.. ఇలా బోలెడు బ్రాండ్స్ కు ఎండోర్సింగ్ చేస్తున్నాడు కోహ్లి. అయితే ప్రధాన బ్రాండ్ లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం. కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు. జనాల్లో కోహ్లికి ఉన్న యాక్సెప్టెన్సీ కూడా. మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర, ఇలా వేదిక ఏదైనాసరే కోహ్లికి విపరీతమైన జనాదరణ ఉంది. ఇది కోహ్లి పర్ ఫార్మెన్స్‌తో ఏమాత్రం సంబంధంలేని వ్యవహారమని చెప్తున్నారు ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేస్ నాథ్.
కోహ్లి గనుక ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే, అన్నీ మరిచిపోతారని, అప్పుడు మరింత పుంజుకుని బ్రాండ్ వాల్యూ రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారాయన. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ నాలుగేళ్లపాటు ఎలాగైతే రాణించాడో, బ్రాండ్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్నాడో కోహ్లి విషయంలోనూ అలాగే జరగొచ్చని అని అన్నారు. కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌లకు సంబంధించి చేసే ఒక్క పోస్ట్‌కి కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్ మెంట్ కోసం ఒక్కో బ్రాండ్ కి ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు.