Begin typing your search above and press return to search.

మహిళలు లావెక్కడానికి, శృంగారానికి ఏం సంబంధం?

By:  Tupaki Desk   |   18 Sept 2020 9:00 AM IST
మహిళలు లావెక్కడానికి, శృంగారానికి ఏం సంబంధం?
X
శృంగారం.. ఇప్పుడు దీనిపై బహిరంగంగా ఎవరూ వ్యాఖ్యానించలేని పరిస్థితి.. మహిళలైతే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు.. అందుకే ఈ నిగూఢ రహస్యం తాలూకా సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. ఇటీవలే ఓ పరిశోధనలో దీనిపై నిజాలు వెల్లడయ్యాయి..

వివాహం అయ్యాక చాలా మంది మహిళలు లావు అవుతూ ఉంటారు. అప్పటివరకూ బక్కపల్చగా ఉన్న వాళ్లకు కూడా ఒంట్లో కొత్త సత్తువా వస్తూ ఉంటుంది. ఈ మార్పు చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. దీంతో.. ఈ మార్పుకూ శృంగారానికి సంబంధం ఉంటుందనే ఒక అభిప్రాయం ఉంది. తరచూ సెక్స్ లో మహిళలు పాల్గొంటే అలా లావవుతారని కొంతమంది చెబుతూ ఉంటారు.. ఇదో నమ్మకంగా ఏర్పడిపోయింది.

అయితే ఈ నమ్మకంపై తాజాగా బ్రిటన్ దేశంలో ఓ సర్వే జరిగింది. పెళ్లి అయ్యాక మహిళలు లావు అవుతారనడం ఒక అపోహ మాత్రమేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వివాహం తర్వాత మహిళలు లావు అయితే కావచ్చు కానీ.. అలా బరువు పెరగడానికి సెక్స్ కూ ఎలాంటి సంబంధం లేదని వీరు చెబుతున్నారు. పెళ్లి తర్వాత మహిళలే కాదు.. పురుషులు లావు అవుతూ ఉంటారు.

పెళ్లి తర్వాత తీసుకునే ఆహారం.. మానిసిక ఆందోళనలు తగ్గడం.. శారీరక శ్రమ తగ్గడం.. వంటి కారణాల వల్ల పెళ్లి తర్వాత చాలా మంది లావవుతూ ఉంటారని పరిశోధకులు తేల్చారు. అంతేకానీ.. సెక్స్ కు బరువు పెరగడానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరి పచ్చిగా చెప్పాలంటే.. పురుషుడి వీర్యం మహిళలో చేరడం వల్ల బరువు పెరిగే అవకాశాలేవీ ఉండవని వైద్య పరిశోధకులు కుండబద్దలు కొట్టారు.