Begin typing your search above and press return to search.
సోము అప్పా... ఏపీలో మత పిచ్చి లేదప్పా...!
By: Tupaki Desk | 27 Jan 2022 11:30 AM GMTఅప్పుడెప్పుడో 1984లో కేవలం రెండు ఎంపీ సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ ఈ రోజు దేశంలో రెండుసార్లు వరుసగా బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో పాటు తిరుగులేని ఏకచక్రాధిపత్యం చలాయిస్తోంది. మూడున్నర దశాబ్దాల క్రిందట కాంగ్రెస్ దేశాన్ని తిరుగులేని విధంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏలుతున్నప్పుడు అసలు బీజేపీ అనే ఒక పార్టీ ఉందన్న విషయమే చాలా మందికి తెలియదు. అప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం బలమైన శక్తిగా ఉంది. అలాంటి టైంలో 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 లోక్‌సభ సీట్లే వచ్చాయి. అందులోనూ తెలంగాణలోని హన్మకొండ ఒకటి.
ఆ తర్వాత అద్వానీ రథయాత్ర తర్వాత దేశంలో క్రమక్రమంగా బీజేపీ పుంజుకోవడం ప్రారంభించింది. బీజేపీ ముందు నుంచి హిందూత్వ వాదాన్నే భుజాన వేసుకుంటోంది. ఆ హిందూత్వ నినాదంతోనే బీజేపీ ఈ రోజు బలంగా వేళ్లూనుకుంది. నార్త్‌లో ఈ హిందూత్వ వాదాన్ని బీజేపీ చివరకు జాతీయవాదంగా మార్చే విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యిందన్న చర్చలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నార్త్‌లో కూడా హిందూ కులాలు, హిందూత్వ వాదంతోనే పాగా వేసేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
ఇదే స్కెచ్ ఇప్పుడు ఏపీలో కూడా అమలు చేసి అధికారంలోకి రావాలని చూస్తోంది. దేశ రాజకీయాలకు ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏపీలో మత రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ కుల రాజకీయాల ప్రభావం ఎక్కువ. కొద్ది రోజుల క్రితం జరిగిన రామతీర్థం సంఘటన, అంతర్వేది రథం దగ్ధం విషయాలను పాపులర్ చేసి హిందూత్వ వాదాన్ని హైలెట్ చేయాలని చూసినా పెద్దగా అప్లాజ్ రాలేదు.
ఇక ఇప్పుడు గుంటూరులో జిన్నా టవర్‌ను కెలుకుతోంది. అప్పుడెప్పుడో ఏడెనిమిది దశాబ్దాల నుంచి అక్కడ జిన్నా టవర్ ఉంది. అది గుంటూరు సంస్కృతిలో భాగం అయ్యింది. ఇప్పుడు ఆ పేరు మార్చి.. దేశం కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టాలంటూ మతతత్వాన్ని రెచ్చగొట్టే పనిలో బీజేపీ ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో సోము హడావిడి చూస్తోన్న ఏపీ జనాలు కూడా సోము అప్పా.. ఏపీలో ఈ మీత రాజకీయాలు చెల్లవప్పా అని సెటైర్లు కూడా వేస్తున్నారు.
ఆ మాటకు వస్తే ఏపీలో 90 శాతం ఓటింగ్ రూరల్, పల్లెల నుంచే ఉంటుంది. అక్కడ హిందు - ముస్లింల మధ్య ఐక్యత ఎక్కువుగా కనిపిస్తుంది. వాళ్లకు ఈ మత విద్వేషాలు పట్టవు. అయితే ఇక్కడ ప్రధానంగా కుల రాజకీయాల ఆధిపత్యమే ఉంటుంది. ఇక్కడ హిందూత్వ వాద ఎజెండాలు పనిచేయవు. కుల రాజకీయాలను ముందుగా నమ్ముకున్న బీజేపీ కన్నా, సోములను నమ్ముకున్నా పని కాకపోవడంతో మళ్లీ హిందూత్వ వాదాన్ని భుజనకెత్తుకుంది. అది వర్కవుట్ కాదన్న విషయం వాళ్లకు ఎప్పటకీ అర్థమవుతుందో ?