Begin typing your search above and press return to search.
కోవిషీల్డ్ డోసుల గ్యాప్ మార్పుపై ఆందోళన అనవసరం … కేంద్రం క్లారిటీ !
By: Tupaki Desk | 12 Jun 2021 10:31 AM GMTకరోనా మహమ్మారిని కట్టడి చేసే కోవిషీల్డ్ టీకా తీసుకునే విరామ కాలాన్ని తగ్గించారంటూ వచ్చిన వార్తలపై ఆందోళన అనవసరమని కేంద్రం వెల్లడించింది. ఈ టైం గ్యాప్ ని, శాస్త్రీయ అధ్యయనం ప్రకారమే తగ్గించడం జరిగిందని, అయితే ప్రజలు దీనిపై అయోమయానికి గానీ, కలవరానికి గానీ గురి కారాదని నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీ.కె.పాల్ అన్నారు. ఒక్కోసారి రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని బ్యాల్సన్స్ చేయాల్సి ఉంటుందని, దీన్ని గోరంతలు కొండంతలు చేయరాదని ఆయన కోరారు. ఈ నిర్ణయాలన్ని జాగ్రత్తగా తీసుకున్నవేనని, గ్యాప్ పెంచినప్పుడు మొదటి డోసు తీసుకున్నవారికి వైరస్ వల్ల కలిగే రిస్క్ ను పరిశీలించడం జరిగిందన్నారు.
ఇలా వీరిలో కూడా రోగ నిరోధక శక్తి పెరగవలసి ఉందన్నారు. అంతే తప్ప ఇందులో సందిగ్ధతకు తావు లేదన్నారు. శాస్త్రీయ స్టడీని పురస్కరించుకునే కోవిషీల్డ్ వ్యాక్సిన్ గ్యాప్ పై మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని పాల్ వివరించారు. నిపుణులే ఈ సూచనలు చేశారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొంతమంది రీసెర్చర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు.భవిష్యత్తులో మా సంస్థ తీసుకునే ఏ నిర్ణయంలోనైనా అయోమయానికి తావు లేకుండా చూస్తాం, పైగా అందరితోనూ చర్చించి తగిన విధానాన్ని పాటిస్తాం అని చెప్పారు.
ఇమ్యునైజేషన్ పై గల నేషనల్ టెక్నీకల్ గ్రూప్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులు ఉన్న విషయాన్ని మరువరాదని పాల్ పేర్కొన్నారు. మా సంస్థ తీసుకునే నిర్ణయాలను ప్రజలు గౌరవిస్తారని ఆశిస్తానన్నారు. బ్రిటన్ లో కూడా ఇలాగే వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో మార్పులు చేశారని, మొదట విరామ కాలాన్ని 12 వారాలుగా ప్రకటించారని ఆయన చెప్పారు. కానీ అది సురక్షితం కాదని తాము భావించామన్నారు.