Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో వీడికంటే అదృష్టవంతుడు మరొకరుండరు !

By:  Tupaki Desk   |   25 May 2020 11:50 AM GMT
లాక్ డౌన్ లో వీడికంటే అదృష్టవంతుడు మరొకరుండరు !
X
దేశ ‌రాజ‌ధానిలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.ఢిల్లీలోని జగత్‌పురి చంద్ర నగర్ ప్రాంతంలో ఫూల్ మియా అనే పండ్ల వ్యాపారికి చెందిన‌ రూ. 30 వేలు విలువైన‌ మామిడి పండ్లు లూటీ అయ్యాయి. దీనితో ఆ వ్యాపారి లబోదిబోమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీనితో ఎంతో మంది మనసున్న మంచి మనుషులు స్పందించారు. ఆ చిరు వ్యాపారికి తమకి తోచినంత సాయం చేసారు. ఆలా మొత్తం 8 లక్షల రూపాయల డొనేషన్లు ఇచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ఫూల్ మియా ‌త‌న కుటుంబంతో సహా ఢిల్లీలోని జగత్ ‌పురిలో ఉంటున్నాడు. బుధ‌వారం బండిపై మామిడి పండ్లు అమ్ముతున్న సమయంలో పక్క దుకాణదారుకి గొడవ జరిగింది. వారిద్దరూ అలా గొడవపడుతుండగా ఆ పక్క వెళ్లే జనాలు దీన్ని అదునుగా భావించి చోటు బండి మీద ఉన్న మామిడి పళ్లను అందినకాడికి అందుకుని వెళ్లారు. కొందరు హెల్మెట్‌ లో పెట్టుకుని మరీ వెళ్లారు. చోటు వచ్చి చూసేసరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది.

దీంతో మియా రూ. 30 వేల రూపాయ‌ల విలువైన మామిడి పండ్ల‌ను న‌ష్టపోయాడు. ఖాళీ బండి చూసి లబోదిబోమన్నాడు. అసలే లాక్‌ డౌన్‌తో కష్టాల్లో ఉన్న తనకు ఇలా జరగడంతో ఇక కోలుకోలేనని బోరుమన్నాడు. అత‌ని ద‌గ్గ‌ర మామిడి పండ్ల‌ను దోచుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ ‌గా మారింది. దీనిని చూసివారు అతనికి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. అతని బ్యాంకు ఖాతా నెంబర్ తెలుసుకొని అనేక మంది డబ్బులు పంపించారు. దీంతో అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ. 8లక్షలు జమ అయ్యాయి. దీనిపై చోటు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు