Begin typing your search above and press return to search.

వైద్యఆరోగ్యశాఖ ప్రకటన: హరీష్ రావు ఫొటోనే లేదు.. దారుణం ఇదీ

By:  Tupaki Desk   |   23 Nov 2022 3:30 PM GMT
వైద్యఆరోగ్యశాఖ ప్రకటన: హరీష్ రావు ఫొటోనే లేదు.. దారుణం ఇదీ
X
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్త మెడికల్ కాలేజీని కూడా కేటాయించకపోవడమే ఇందుకు కారణం. కళాశాలలు ఈరోజు తరగతులను ప్రారంభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉదయం అన్ని ప్రధాన వార్తాపత్రికలలో దీని గురించి ప్రధాన పేజీ ప్రకటనలను ఇచ్చింది.

యాడ్స్ లో కేసీఆర్ ఫొటోనే పెద్దగా వేశారు. ఈ కళాశాలలు.. ఈ శాఖ చూసే మంత్రి ఫొటో అందులో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫొటోను ఆ శాఖ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

సాధారణంగా ఇలాంటి యాడ్స్ లో సంబంధిత మంత్రుల ఫొటోలు కనీసం చిన్నవిగా అయినా తప్పక ఉంటాయి కానీ హరీష్ రావు పూర్తిగా ఇందులో లేకపోవడం చూసి ఆయన మంత్రేనా? అసలు వైద్యఆరోగ్యశాఖ ఉందా? ఆ మంత్రిని పట్టించుకోరా? అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇదే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీన్ని ఉపయోగించుకుని కేసీఆర్, హరీష్ రావుల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ఎనిమిది కొత్త వైద్య కళాశాలలు 1,500 కొత్త ఎంబీబీఎస్ సీట్లను ఇచ్చాయి. అది తెలంగాణలో వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రారంభం ఆ శాఖ మంత్రికే చోటులేకపోవడం దారుణమనే చెప్పొచ్చు. దీన్నే బీజేపీ నేతలు హైలెట్ చేస్తూ మండిపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.