Begin typing your search above and press return to search.

నేటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఊరు .. ఎక్కడుంది , ఎలా సాధ్యమైందంటే ?

By:  Tupaki Desk   |   29 April 2021 11:30 PM GMT
నేటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఊరు .. ఎక్కడుంది , ఎలా సాధ్యమైందంటే ?
X
దేశం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. కరోనా సోకిన వారు పిట్టల్లా రాలిపోతున్నాయి. బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ అంతకన్నాలేదు. మరోవైపు కరోనా వ్యాప్తికి కారణమవుతున్న నిర్లక్ష్యం, ఇవన్నీ పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. అయితే దేశం మొత్తం ఈ పరిస్థితి ఉంటె .. ఓ గ్రామంలో మాత్రం మాకు అసలు కరోనా అంటే ఏమిటో తెలియదు. మేము మాస్కులు పెట్టుకోము , మాకు ఆ అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. అసలు కరోనా లేని ఆ గ్రామం మధ్యప్రదేశ్‌లోని ఆగర్- మాల్వా గ్రామం. ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే..వాళ్లు ఎంత అప్రమత్తంగా ఉన్నోరో అర్థం చేసుకోవచ్చు.

2020 నుంచి యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో భారత్ కూడా కరోనాకు వణికిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన ఆగర్-మాల్వా గ్రామానికి చెందిన ప్రజలు ఎంతో అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడి చర్యలను కఠినంగా అమలు చేశారు. దీంతో ఈ నాటికీ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలోని మహిళలంతా తమ ఇళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ వస్తున్నారు. ఏ ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లి వచ్చినా తప్పనిసరిగా పరిశుభ్రత పాటిస్తున్నారు. ఇదేవిధంగా గ్రామంలోని కొందరు యువకులు ఒక టీమ్‌గా ఏర్పడి, కొత్తగా ఎవరు వచ్చినా... వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న అనంతరమే గ్రామంలోనికి రానిస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి..మాస్కులు పెట్టుకుని, శానిటైజ్ చేసుకుంటూ..ఫిఫ్టులవారిగా అనుక్షణం కాపలాకాస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో కాపలాగా ఉంటున్నారు. దీంతో ఈ నాటికీ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.