Begin typing your search above and press return to search.
ఏపీలోని ఆ జిల్లాలో 161 గ్రామాల్లో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు లేదట !
By: Tupaki Desk | 26 May 2021 5:30 PM GMTసెకండ్ వేవ్ లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఇప్పటివరకూ కరోనా బారినపడకుండా ఉన్న గ్రామాలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దాదాపు 161 గ్రామాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా మహమ్మారి కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒకే జిల్లాలో ఈ స్థాయిలో కరోనా రహిత గ్రామాలు ఉండటం విశేషమనే చెప్పాలి. కరోనా కట్టడికి కృషి చేసి 161 గ్రామాలను కోవిడ్ రహితంగా నిలిపిన ప్రజలు,ప్రజాప్రతినిధులు,అధికారులకు కలెక్టర్ చంద్రుడు అభినందనలు తెలియజేశారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అనంతపురం మెరుగ్గా ఉందని, ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ కొత్త కేసులు నమోదు కాకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తాం అని అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లాల కలెక్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని కలెక్టర్ చంద్రుడు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో వార్డుల వారీగా కరోనా కట్టడికి కమిటీల ఏర్పాటుతో పాటు అన్ని గ్రామాల్లో జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం చేపట్టినట్లు ప్రధానికి అందజేసిన నివేదికలో పొందుపరిచారు.
గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్చ సంకల్పం పేరుతో బ్లీచింగ్ పౌడర్ ను చల్లడంతో పాటు చెత్త చెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేసే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఫీవర్ సర్వే ద్వారా ఎవరెవరు జ్వరంతో బాధపడుతున్నారో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించడం,కేవలం ఇల్లు పొలాలకే పరిమితవడం వలనే కరోనా రహితంగా మార్చాయని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. అనంతపురంలోని హిందూపూర్ లో బుధవారం 1000 ఎల్ పీఎం ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించారు.