Begin typing your search above and press return to search.
హరీశ్ రావుతో అక్కడ విభేదాలు వచ్చాయి..? జగ్గారెడ్డి..
By: Tupaki Desk | 7 March 2022 3:13 AM GMTతెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న హరీశ్ రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి విభేదాలున్నాయా..? వీరిద్దరికి ఎందుకు పడడం లేదు..? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుండగా.. జగ్గారెడ్డి మాత్రం హరీశ్ రావు పేరు చెబితే ఎందుకు మండిపడుతున్నారు..? ఇంతకీ జగ్గారెడ్డికి మంత్రి హరీశ్ రావు చేసిన అన్యాయమేంటి..? లాంటి పలు విషయాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ఆదివారం నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘హరీశ్ రావును అందరూ చూసి చాలా మంచివారు అనుకుంటున్నారు. ఆయన పైకి తియ్యగా కనిపిస్తాడు. కానీ వెనుకాల మరో రకంగా ఉంటాడు. ఆయనకు తన మేనమాన కేసీఆర్ స్వభావం వచ్చినట్లు ఉంది. కానీ కేసీఆర్ హరీశ్ రావులా కన్నీంగ్ కాదు. ఏదైనా ముహం ముందే చెప్పేస్తాడు. ఇక కేటీఆర్ మాత్రం తన తల్లిలా మృదు స్వభావి. ఆయన క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుంది. భవిష్యత్ లో కేసీఆర్ రాజకీయ జీవితంపై దెబ్బపడుతుందంటే.. అది హరీశ్ రావుతోనే జరుగుతుంది. హరీశ్ రావు వల్ల కేసీఆర్ కు ఎప్పటికైనా ప్రమాదమే.. కేసీఆర్ ను కొన్ని విషయాల్లో పొగడవచ్చు. అయితే ఇలా అంటే నేను టీఆర్ెస్లో చేరుతున్నానని అంటారు. కానీ నేను ప్రజలకు జవాబుదారిని, సీఎంను అడిగే విధానం వినయపూర్వకంగా ఉంటే కేసీఆర్ తప్పకుండా వింటారు. కేసీఆర్, కేటీఆర్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ హరీశ్ రావుతో మాత్రం 2004 నుంచి గొడవలు ఉన్నాయి.’ అంటూ జగ్గారెడ్డి తన మనుసులోని మాటలను బయటపెట్టాడు.
‘ఇక వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే కాంగ్రెస్ లో ఉంటాడా.. అని కొందరు అంటున్నారు. పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే నేను ‘పది పార్టీలు తిరిగి తిరిగి కాంగ్రెస్ కు వచ్చిన..!!’.. సరే నేనంటి పార్టీ మారుతాను. కేసీఆర్ నాకు రాజకీయంగా ఎప్పటికీ శత్రువే. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక ఎప్పుడూ ఆయనను కలవలేదు. గత ప్రభుత్వాల్లో కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నప్పుడు సీఎంను కలవలేదా..? నేను అలాగే కలిశా. కానీ ఇప్పుడు అలా కలిస్తే పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నరు..నా సంగతి పక్కనబెడితే శ్రీధర్ బాబు, హనుమంతరావు లాంటి వారు కూడా పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారికి కొంచెమైనా బుద్ధి ఉండాలి..’ అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.
‘అయితే మా పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క సీఎంను కలవడం పై కొన్ని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో సీఎం తెలివిగా ప్రవర్తించారు. ఆ సమయంలో మరియమ్మయ లాకప్ డెత్ ఉండడంతో సీఎం పిలిచినప్పుడు వెళ్లకపోతే మాకు నష్టం జరుగుతుంది. అయితే అలా వెళ్లినందుకు మాకు నష్టం జరిగింది. కొందరు ఢిల్లీకి కూడా సీఎంను కలిశారిని ఢిల్లీకి కూడా చెప్పారు. ’ అంటూ పార్టీలోని లోపాలను జగ్గారెడ్డి బయటపెట్టాడు.
‘రేవంత్ రెడ్డి నాయకత్వంపై నాకు అవగాహన ఉంది. కానీ కొన్ని సార్లు నేను సలహాలు ఇచ్చాను. తనకు తెలియకుండా ఏదో జరుగుతుందని చెప్పాను. అయితే రేవంత్ రెడ్డికి అధ్యక్షుడిగా ఉండొద్దని నేను అనను. కానీ ఆయన చేసే పనిలో ఆలోచన ఉండాలి. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఇప్పటికే మేం కలిసి పనిచేయట్లేదని ప్రచారం సాగుతోంది. కానీ దీనిని సరిదిద్దే బాధ్యత అధ్యక్సుడిదేనని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
‘కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంద్ కోడిని ఉగులాడేసి చికెన్ తిన్నట్లు ఊహించికున్నట్లు ఉంది. ఆహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు చేసినట్లు కేసీఆర్ ప్రజలకు అలా చూపిస్తున్నాడు. అయితే దళితులందరికీ ఒకేసారి న్యాయం చేస్తామంటే మేం ఒప్పుకుంటాం. కానీ 20 ఏళ్లకు ఇస్తామంటే ఎలా ఒప్పుకోవాలి..?’ అంటూ కేసీఆర్ పై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.