Begin typing your search above and press return to search.
ఒకే మాట మీద నిలబడదాం ..భారత్-చైనా అంగీకారం !
By: Tupaki Desk | 25 Jun 2020 1:00 PM GMTగత కొన్ని రోజులు చైనా , భారత్ మధ్య పరిస్థితి ఉదృతంగా మారాయి. అయితే , తాజాగా ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యపై విభేదాల పరిష్కారానికి ఉభయ దేశాల నాయకులూ ఏకాభిప్రాయానికి వచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని, బోర్డర్ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని వారు నిర్ణయించినట్టు సీనియర్ దౌత్యాధికారులు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన వీరు.. లడాఖ్ తూర్పు ప్రాంతంలో నియంత్రణ రేఖ పొడవునా ఉద్రిక్తతలు చల్లారడానికి మార్గాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చైనా విదేశాంగ శాఖలో డిపార్ట్ మెంట్ ఆఫ్ బౌండరీ అండ్ ఓషనిక్ అఫైర్స్ శాఖ లోని డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్, భారత విదేశాంగ శాఖలోని సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాత్సవ మధ్య చర్చలు జరిగాయి.
భారత-చైనా సరిహద్దు సమస్యపై కూలంకషంగా వీరు చర్చించారని, ఈ నెల 17 న ఉభయ దేశాల విదేశాంగ మంత్రులూ ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపుల్లో వఛ్చిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని వీరు తీర్మానించారు.ఈ నెల 6, 22 తేదీల్లో రెండు దేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన చర్చల ఫలితాలను కూడా వీరు విశ్లేషించారు. ప్రస్తుతం లడాఖ్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉంది. నిన్నటికి నిన్న విడుదలైన శాటిలైట్ ఇమేజీలను చూస్తే గాల్వన్ వ్యాలీలో చైనా దళాల ఉనికి, వారి ఆర్టిల్లరీ శకటాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.