Begin typing your search above and press return to search.

కరెక్ట్ టైమ్.. కలవాల్సిందే మరి ...?

By:  Tupaki Desk   |   8 Nov 2021 8:30 AM GMT
కరెక్ట్ టైమ్.. కలవాల్సిందే మరి ...?
X
దేనికైనా ముహూర్తాలు ఉంటాయి కానీ రాజకీయాల్లో అవి ఉండవు. మీనం మేషం లెక్కిస్తూ కూర్చుంటే కాగల కార్యం ఏమీ కాకుండా అయిపోతుంది. అపుడు వగచి వేదన చెందినా సుఖం ఉండదు. ఏపీ రాజకీయాలలో చూసుకుంటే అధికార వైసీపీని ఢీ కొట్టాలంటే పొత్తులు ఎత్తులూ ఉండాల్సిందే. ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే అంత విషమే అవుతుంది అన్నది పొలిటికల్ పండిట్స్ మాట. ఇప్పటికే అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ స్వైర విహారం చేస్తోంది. ఏక పక్ష విజయాలను నమోదు చేస్తోంది. దాంతో ప్రధాన ప్రతిపక్షం ధీటుగా పోరాడుతున్నా బలం సరిపోవడం లేదు.

కరెక్ట్ గా ఇదే తగిన సమయం పొత్తులు పెట్టుకునేందుకు అంటున్నారు అంతా. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య పొత్తులు ఉంటాయని ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు పరిషత్ ఎన్నికల్లోనే అనధికార పొత్తులు పెట్టుకుని గోదావరి జిల్లాల్లో బాగానే లాభపడ్డాయి. ఆ మేరకు వైసీపీని గట్టి దెబ్బ తీశాయి కూడా. చేతి దాకా వచ్చిన ఎంపీపీ పీఠాన్ని దక్కనీయకుండా ఈ రెండు పార్టీలు చేసిన రాజకీయం అదుర్స్ అనిపించింది. ఇపుడు చూస్తే లోకల్ బాడీలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక విధంగా దీన్ని మినీ సమరంగా అంతా చూస్తున్నారు.

దాంతో టీడీపీకి బలం చాలని చోట జనసేన, ఆ పార్టీకి అవసరం అయిన చోట టీడీపీ సహకారం అందిస్తే వైసీపీకు చుక్కలు చూపించవచ్చు అని రెండు పార్టీల నేతలూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే క్యాడర్ లెవెల్ లో ఒక అవగాహన ఉంది. దానిని మరింతగా పెద్దది చేసుకుని లీడర్ల స్థాయిలో కలిస్తే వైసీపీని గట్టిగా ఢీ కొట్టవచ్చు అంటున్నారు.

నిజానికి కలుద్దామనుకున్నపుడు ఆ పని ఏదో కరెక్ట్ టైమ్ లో చేస్తే ఫలితాలు బాగా వస్తాయి కదా అన్న చర్చ అయితే ఉంది. దీని మీద జనసేన, టీడీపీలలో ఇంకా ఏవో మొహమాటాలు, తెర చాటు వ్యవహారాలు ఉన్నట్లునాయి అంటున్నాయి. అయితే అవన్నీ ఆలోచించడానికి సమయం లేదు మిత్రులారా అంటోంది ఏపీ రాజకీయం. సో ఎంత వేగంగా జత కడితే ఈ రెండు పార్టీలకు అంత బెటర్ అన్నదే వారి శ్రేయోభిలాషుల మాటగా ఉందిట. మరి ఇంకెందుకు ఆలస్యం కలిస్తే ఒక పని అయిపోతుందిగా. సో సైకిలెక్కి జనసేన సవారీ చేయడానికి ఇంతకు మించిన ముహూర్తం వేరేది లేదు అంటున్నారు. మరి అలాగే ఆలోచించే మిత్రులిద్దరికీ బెస్ట్ ఆఫ్ లక్ అని కూడా హితైషులు చెబుతున్నారు.