Begin typing your search above and press return to search.
జ్వరం ఉండదు కానీ.. పాజిటివ్.. కొత్త లక్షణంతో పరేషాన్
By: Tupaki Desk | 18 July 2021 3:36 AM GMTకంటికి కనిపించనంత సూక్ష్మజీవి మానవాళికి ఎంతలా చుక్కలు చూపిస్తుందో కరోనా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సహజ పరిణామంగా ఏర్పడిన ఒక వైరస్ ఇంతలా ప్రభావం చూపుతుందా? అన్న ప్రాథమిక ప్రశ్నకు నిపుణుల సమాధానం నో అనే మాట వినిపిస్తుంది. కరోనా ఎపిసోడ్ లో అసలేం జరుగుతుందన్న విషయంపై మేధావులు మొదలు అంతర్జాతీయ మీడియా వరకు అంతులేని మౌనాన్ని ఆశ్రయించటం మినహా చేసిందేమీ లేదు. ప్రపంచాన్ని కరోనా చుట్టేయటంలో ఎవరు ఔనన్నా.. కాదన్నా దోషి మాత్రం చైనానే. అయితే.. ఆ దేశాన్ని వేలెత్తి చూపించి.. చర్యలు తీసుకునే దమ్ము.. ధైర్యం ప్రపంచంలోని మరే దేశానికి లేదన్నది వాస్తవం.
మాయదారి కరోనా వైరస్ తో వచ్చిన చిక్కేమంటే.. సదరు మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవటం.. మరింత తెలివిగా ఆరోగ్యవంతుల్ని అనారోగ్యులుగా చేయటం.. తన బారిన పడేలా చేయటం లాంటివి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో కొత్త లక్షణాలెన్నో కనిపించగా.. తాజాగా మూడో వేవ్ మొదలైనట్లేనన్న మాట పలువురి నోట వినిపిస్తున్న వేళ.. కరోనా సైతం తన రూపాన్ని మార్చుకోవటం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు నిపుణులు.
సాధారణంగా కొవిడ్ సోకిందంటే వారి ఒళ్లు వెచ్చబడటం.. హై ఫీవర్ రావటం సహజ లక్షణం. ఈ కారణంగానే కొవిడ్ రోగుల్ని గుర్తించేందుకు సూపర్ మార్కెట్లు మొదలు కొని అన్ని చోట్ల ఎంట్రన్స్ లో టెంపరేచర్ స్కానర్ తో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా చోటు చేసుకున్న లక్షణంతో చూసినప్పుడు కొవిడ్ పాజిటివ్ అయినప్పటికి జ్వరం ఉండదని చెబుతున్నారు. మొదటి.. రెండో వేవ్ లతో పోల్చినప్పుడు ఈ కొత్త లక్షణం మూడో వేవ్ లో కనిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు టెంపరేచర్ లో వచ్చే మార్పులతో కరోనా సోకిందన్న సందేహం రావటం.. ఆ వెంటనే పరీక్ష చేసుకుంటున్నారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు.
వైరస్ లో చోటు చేసుకుంటున్న మార్పులే తాజా మార్పులకు కారణమన్న మాట వినిపిస్తోంది. సెకండ్ వేవ్ వరకు కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపించాయని.. ఎక్కువ మందిలో 103 డిగ్రీల వరకు జ్వరం రావటం సహజమన్నట్లుగా ఉండేది. ఇప్పుడు కొద్ది రోజులుగా మాత్రం నమోదవుతున్న కేసుల్లో కరోనా వచ్చినోళ్లలో జ్వరం లాంటివి కనిపించటం లేదు. ఒకవేళ టెంపరేచర్ ఉన్నా.. మైల్డ్ ఫీవర్ ఉంటుందే తప్పించి.. గతంలో మాదిరి ఉండటం లేదు. దీంతో.. కరోనా ఇతర లక్షణాల్లో ఏం ఉన్నా సరే.. వెంటనే పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందన్న మాద వినిపిస్తోంది.
జ్వరంతో సంబంధం లేకుండా ఇతర లక్షణాలు ఏం కనిపించినా.. వెంటనే కొవిడ్ టెస్టు చేయించుకోవటం చాలా ముఖ్యమని చెబుతున్నారు. థర్డ్ వేవ్ ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ఈ కొత్త అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. జ్వరం లేకున్నా.. ఎక్కువగా జలుబు.. గొంతులో గరగర.. ముక్కు దిబ్బడ.. ముక్కు కారటం.. ఒళ్లునొప్పులు కూడా కరోనా లక్షణాలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు కరోనానిర్దారణకు స్వాబ్ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.
మారిన వైరస్ పుణ్యమా అని కొత్త పద్దతులతో కొవిడ్ ను గుర్తించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ర్యాపిడ్.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చి.. లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా సీబీపీ (బ్లడ్ టెస్టు) చేయించుకోవటం ముఖ్యమని చెబుతున్నారు. తెల్ల రక్తకణాల్లో ఉండే న్యూట్రోఫిల్ కౌంట్ మరీ ఎక్కువగా ఉన్నా.. లింఫోసైట్స్ తక్కువగా ఉన్నా కొవిడ్ సోకి ఉంటుందన్న విషయాన్ని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలని.. ఏ మాత్రం సందేహం ఉన్నా.. ఆలస్యం చేయకుండా పరీక్షల ద్వారా కొవిడ్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.