Begin typing your search above and press return to search.

ఆ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చినందుకు 8,207 కోట్లు

By:  Tupaki Desk   |   27 Jun 2017 5:45 AM GMT
ఆ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చినందుకు 8,207 కోట్లు
X
ప్ర‌పంచంలోనే బ‌హుశా అత్య‌ధిక `మ‌ద్ద‌తు` ధ‌రగా బ్రిట‌న్‌ లో కుదిరిన ఈ డీల్ నిలుస్తుండ‌వ‌చ్చు. మధ్యంతరంగా పార్లమెంట్‌ కు ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాక బ్రిటన్ ప్రధాని థెరెసా మే నానా తంటాలు పడుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా కుదుర్చుకున్న డీల్ ఫ‌లితంగా మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 8207 కోట్ల‌ను వివిధ రూపాల్లో చెల్లించుకోవాల్సి వ‌స్తోంది.

థెరెసా మే తన మైనారిటీ సర్కార్‌ ను గట్టెక్కించేందుకు ఉత్తర ఐర్లాండ్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ మద్దతు కోరారు. అయితే ఆ పార్టీ పెట్టిన షరతుపై రెండు వారాల పాటు జరిగిన చర్చలు తాజాగా ఒక కొలిక్కి వచ్చాయి. డీయూపీ తమ ప్రాంత అభివృద్ధి కోసం వంద కోట్ల పౌండ్లు (సుమారు రూ.8,207 కోట్లు) కేటాయించాలని షరతు విధించింది. ఇందుకు బదులుగా - బడ్జెట్ - బ్రెగ్జిట్ చట్టాలు - జాతీయ భద్రత - ఇతర శాసన ప్రణాళికల విషయంలో ప్రభుత్వానికి మద్దతునిస్తామని తెలిపింది. ఆ పార్టీ పక్షాన పది మంది ఎంపీలు పార్లమెంట్‌ కు ఎన్నికయ్యారు. గత్యంతరం లేని స్థితిలో థెరెసా మే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి డీయూపీ నాయకురాలు అర్లీన్ ఫోస్టర్ కూడా హాజరయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/