Begin typing your search above and press return to search.
అది ‘బాంబులన్నిటికి బాబు..’ప్రయోగించే ఆలోచనలో పుతిన్
By: Tupaki Desk | 27 Feb 2022 11:30 AM GMTఅది అణుబాంబు కాదు.. కానీ ఆ స్థాయి విధ్వంసాన్ని కలుగజేస్తుంది. ఇప్పటివరు రష్యా అణు సామర్థ్యాన్ని చూసి బెదురుతున్న పాశ్చాత్య దేశాలు ఇకపై ఈ బాంబుకూ భయపడనున్నాయి. బాంబులకే బాబులాంటి బాంబును పుతిన్ ఉక్రెయిన్ పై ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. యుద్ధం మరింత తీవ్రం కావడం ఖాయం. పాశ్చాత్య దేశాలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరం. కాగా, తాము ఉక్రెయిన్ పై యుద్ధానికి వెళ్తున్నామని.. అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని పుతిన్ ఇప్పటికే అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ఆయన అణు బాంబు బూచిని చూపుతున్నారా? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో నాటో దళాలపై దాడులకు దిగకపోవడం ద్వారా పుతిన్ పై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాయి. ఉక్రెయిన్ కు ఒక రకంగా అవి చెయ్యిచ్చాయి. ఇప్పుడేమో.. ఈ సందు చూసుకుని పుతిన్ బాంబులకే బాబు లాంటి బాంబును ప్రయోగించాలని చూస్తున్నారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తన వద్ద ఉన్న శక్తిమంతమైన ఆయుధం 'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' (ఎఫ్‌వోఏబీ)ను బయటకు తీసే వీలుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాన్ని షాక్‌లో ముంచెత్తే వ్యూహంలో భాగంగా 'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'గా పేర్కొనే దీన్ని ప్రయోగించేందుకు రష్యా అధ్యక్షుడు అనుమతిచ్చినట్లు పేర్కొన్నాయి. అణ్వస్త్రం కాకపోయినప్పటికీ ఆ స్థాయి విధ్వంసాన్ని మిగిల్చే ఈ బాంబుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అణుబాంబంత కాకున్నా.. అంతలో కొంత ఎఫ్‌వోఏబీ అసలు పేరు 'థర్మోబారిక్ బాంబ్'. ఇది 44 టన్నుల టీఎన్‌టీతో సమానమైన విస్ఫోటక శక్తిని కలిగి ఉంటుంది. ఫలితంగా 300 మీటర్ల పరిధిలో పెను విధ్వంసాన్ని కలిగిస్తుంది. చిన్నపాటి అణ్వస్త్ర స్థాయిలో ఈ నష్టం ఉంటుంది. థర్మోబారిక్ బాంబును యుద్ధ విమానం నుంచి జారవిడుస్తారు. ఇది లక్ష్యాలను మండించేస్తుంది. ఇందుకోసం గాల్లోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది.
నేలను తాకేలోగానే గాల్లోనే అది పేలిపోతుంది. ఫలితంగా సూపర్‌సోనిక్ ప్రకంపన, తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు వెలువడతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలోని మనుషులు కాలి బూడిదైపోతారు. అమెరికా అభివృద్ధి చేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (ఎంవోఏబీ)కు ప్రతిగా రష్యా దీన్ని 2007లో రూపొందించింది.
ఎంఓవోబీ కన్నా ఇది నాలుగు రెట్లు శక్తిమంతమైందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాంబు 11 టన్నుల టీఎన్‌టీతో సమానమైన పేలుడును సృష్టించగలదు. దీన్ని 2003లో తొలిసారిగా అగ్రరాజ్యం పరీక్షించింది. 2017లో దీన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ప్రయోగించింది.
దానివల్ల ఎంతమంది హతమయ్యారన్నది అమెరికా ప్రకటించలేదు. ఎంవోఏబీకి ప్రతిగా చైనా కూడా షియాన్ హెచ్-6కె పేరుతో ఒక బాంబును అభివృద్ధి చేసింది. 2019లో దీన్ని పరీక్షించింది. ఈ బాంబు ఒక సైనిక స్థావరాన్ని పూర్తిగా నాశనం చేయగలదు.