Begin typing your search above and press return to search.
ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ కీలక సూచన..'2021'లో ఆ అంశాలపై దృష్టి పెట్టాలంట!
By: Tupaki Desk | 26 Dec 2020 3:30 PM GMTకరోనా వైరస్ .. ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధి. ఉన్నవారు నుండి లేనివారు వరకు , పేదవారి నుండి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ మహమ్మారి దెబ్బకి చితికిపోయారు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయినా తీవ్రత మాత్రం తగ్గలేదు. అంతేకాదు, మాయల ఫకీరులా కొత్త రూపాన్ని మార్చుకుని పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో జరిగిన ఆరోగ్య పురోగతిని ఈ మహమ్మారి తుడిచిపెట్టేస్తుందేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలా జరగకుండా ఉండాలంటే వచ్చే ఏడాది కరోనా పై పోరుతో పాటు ఆరోగ్య పరమైన ఇతర అంశాలపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్తూ డబ్ల్యూహెచ్ ఓ .. ఈ మేరకు సభ్య దేశాలకు పది సూచనలు చేసింది.
1. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భద్రత కోసం ప్రపంచ దేశాలు సంబంధాలు పెంచుకోవాలి: ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా సంసిద్ధతను మెరుగుపరచడానికి దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి.
2. వ్యాక్సిన్‌లు, ఔషధాలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలి: కరోనాను ఎదుర్కొనేందుకు 2021లో ప్రపంచదేశాలన్నీ వ్యాక్సిన్లు, ఔషధాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలి. రెండు బిలియన్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుంది.. 245 మిలియన్ చికిత్సలు, తక్కువ మధ్య-ఆదాయ దేశాలలో 500 మిలియన్ల మందికి నిర్దారణ పరీక్షలు ఏర్పాటు, వారికి మద్దతుకు అవసరమైన ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం.
3. సైన్స్, డేటాపై ప్రపంచ నాయకత్వాన్ని ప్రోత్సహించడం: దేశాలు వారి ఆరోగ్య సంబంధిత లక్ష్యాల దిశగా పురోగతిని నివేదించడానికి ఆరోగ్య డేటా, సమాచార వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. కరోనా, ఇతర అత్యవసర పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆ అభివృద్ధిని ఉపయోగించుకునే అవకాశాలను గుర్తించడం.
4. ప్రపంచవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య భద్రత కోసం దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆరోగ్య అత్యవసరస్థితిని ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారించుకోవాలి.
5. అన్ని దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఏడాది డబ్ల్యూహెచ్‌వో తన భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉన్న ఏకైక మెరుగైన అవకాశం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థే.
6. వ్యాధినిరోధకత: అంటు వ్యాధుల చికిత్సకు సమర్థవంతమైన ఔషధాలు కలిగి ఉంటేనే దేశాలు వాటిని ఓడించగలవు. ఇది ప్రపంచ పర్యవేక్షణను మెరుగుపరిచి, జాతీయ కార్యాచరణ ప్రణాళికలకు మద్దతు ఇస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
7. ఆరోగ్యరంగంలో అసమానతలకు దరిచేరనీరాదు. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగ వివక్షత ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్యసేవలు సమానంగా అందించేలా దేశాలు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలి.
8. అంటువ్యాధులు కాని రోగాలపై కూడా దృష్టిపెట్టాలి. డబ్ల్యూహెచ్‌వో తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది మరణానికి దారితీసే 10 వ్యాధుల్లో ఏడు ఇలాంటి తరహా అనారోగ్యాలే ఉన్నాయి. అందుకే గుండెపోటు, క్యాన్సర్, డయాబెటిస్ లాంటివాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
9. పోలియో, హెచ్‌ఐవీ, టీబీ, మలేరియా వంటి వ్యాధులను తరిమికొట్టేందుకు డబ్ల్యూహెచ్‌వో కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా కృషి చేస్తోంది. అయితే 2020లో ఈ పరిశోధనలకు కోవిడ్- 19 ఆటంకం కలిగించింది. అందుకే 2021లో వీటిపై మళ్లీ దృష్టిపెట్టాల్సిన అవసరం వచ్చింది. పొలియో, ఇతర వ్యాధులకు వ్యాక్సిన్లు తెచ్చేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలకు పూర్తి సహకారం అందిస్తుంది.
10. మానసిక ఆరోగ్యంపై దేశాలు మరింత దృష్టి సారించాలి. ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యం కల్పించేలా దేశాలు కృషిచేయాలి. మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాలు, సంస్థలు, మనుషుల మధ్య పరస్పర సౌభ్రాతృత్వం ఉండాలని చెప్తూ , అందరం కలిసి కరోనాను తరిమికొట్టాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.