Begin typing your search above and press return to search.
త్వరలో ఆ ముగ్గురు `నాయుళ్లు` జైలుకి?
By: Tupaki Desk | 25 Feb 2020 2:30 PM GMTతెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నాడు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. తెలుగు నేలకు చెందిన నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా స్థానిక పార్టీల సత్తా ఏమిటో చాటి చెప్పిన ఘనత అన్నగారిది. అటువంటి ఆశయాలతో అన్నగారు స్థాపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన చంద్రబాబు హస్తగతం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. వైశ్రాయ్ హోటల్ లో అన్నగారికి జరిగిన అవమానం తెలుగుజాతి ఎప్పటికీ మరచిపోలేదు. తన అల్లుడు చేసిన ద్రోహానికి అన్నగారు తన చివరి రోజుల్లో కుమిలిపోయారని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎన్నోసార్లు చెప్పారు.
తాను మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపిస్తానని అన్నగారు చెప్పారని లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా, అన్నగారి వ్యాఖ్యలు నిజమయ్యేలా త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లబోతున్నారని ఆమె జోస్యం చెప్పారు. త్వరలోనే చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇద్దరు నాయుళ్లు కూడా జైలుకు వెళ్తారని లక్ష్మీ పార్వతి చేసిన సంచలన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. గత ఐదేళ్లలో బాబు అవినీతి, అధికారంతో వేల కోట్లు కొల్లగొట్టారని త్వరలోనే ఆ బండారం బయటపడుతుందని ఆమ అన్నారు.
త్వరలో ముగ్గురు నాయుళ్లు ఊచలు లెక్కబెట్టబోతున్నారని లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరు చంద్రబాబు నాయుడు అని...మరొకరు అచ్చెన్నాయుడు అని...మరొకరు సుజనా(చౌదరి) నాయుడు అని ఆమె పరోక్షంగా విమర్శించారు. బాబు పీఏ ఇంట్లో ఐటీ సోదాలు...ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు...ఆర్థిక అవకతవకలకు పాల్పడి సుజనా.....ఐదేళ్లలో వీరు ఏపీని దోచుకున్నారని, వీరంతా జైలుకు వెళితే చూడాలనుందని లక్ష్మీపార్వతి అన్నారు. దీనిని బట్టి వారు జైలుకు వెళ్లడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురి వ్యవహారంపై ఇంత గట్టిగా లక్ష్మీపార్వతి చెబుతున్నారంటే వారి అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైంనద్న టాక్ వినిపిస్తోంది. వారు జైలుకు వెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పడం వెనుక బలమైన సమాచారం ఉందని టాక్. మరి, లక్ష్మీ పార్వతి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.