Begin typing your search above and press return to search.

ఈ 9 శానిటైజర్లు వాడితే ప్రాణాలకే ప్రమాదమట !

By:  Tupaki Desk   |   27 Jun 2020 2:20 PM IST
ఈ 9 శానిటైజర్లు వాడితే ప్రాణాలకే ప్రమాదమట !
X
చైనాలో వెలుగులోకి వచ్చిన వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ ముప్పు తప్పదని నిపుణులు తేల్చేశారు. ఈ క్రమంలో వైరస్ నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి మాస్క్. రెండోది శానిటైజర్ రాసుకోవడం.

ప్రస్తుతం వైరస్ నుండి కాపాడుకోవాలంటే మరో దారి లేదు. మనం ఏ వస్తువుని ముట్టుకున్నా వెంటనే చేతులను శానిటైజర్‌ తో శుభ్రం చేసుకోవాలి. అలాగే బయటకి వెళ్ళాలి అంటే మాస్క్ తప్పనిసరి. దీనితో వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రకరకాల కంపెనీలకు చెందిన శానిటైజర్లు మార్కెట్ లోకి వెల్లువలా వచ్చేశాయి. ఇక్కడే మరో ప్రమాదం పొంచి ఉంది. కొన్ని సంస్థలు తయారు చేస్తున్న శానిటైజర్లతో వైరస్ చావడం మాటేమో కానీ, మనమే పోయే ప్రమాదం ఉంది అని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ డీఏ) ప్రకటించింది.

ఇటీవల ఎఫ్‌డీఏ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని శానిటైజర్లు విషపూరితమైనవిగా తేలాయి. వీటిని చేతికి రాసుకోని ఏమైనా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని గుర్తించింది. ఎఫ్‌డీఏ గుర్తించిన శానిటైజర్లలో ‘ఎస్క్‌బయోకెమ్ (Eskbiochem SA) సంస్థకు చెందినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఎఫ్డీఏ గుర్తించిన ప్రమాదకర శానిటైజర్లు 9 వరకు ఉన్నాయి.

ఈ 9 శానిటైజర్లను వాడొద్దు:

ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్‌ - All-Clean Hand Sanitizer (NDC: 74589-002-01)
ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్ - Esk Biochem Hand Sanitizer (NDC: 74589-007-01)
క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్ - CleanCare NoGerm Advanced Hand Sanitizer 75% Alcohol (NDC: 74589-008-04)
లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్ - Lavar 70 Gel Hand Sanitizer (NDC: 74589-006-01)
ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్ - The Good Gel Antibacterial Gel Hand Sanitizer (NDC: 74589-010-10)
క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌ - CleanCare NoGerm Advanced Hand Sanitizer 80% Alcohol (NDC: 74589-005-03)
క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 75% ఆల్కహాల్‌- CleanCare NoGerm Advanced Hand Sanitizer 75% Alcohol (NDC: 74589-009-01)
క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌ - CleanCare NoGerm Advanced Hand Sanitizer 80% Alcohol (NDC: 74589-003-01)
శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ - Saniderm Advanced Hand Sanitizer (NDC: 74589-001-01)

ఈ 9 శానిటైజర్లలో ఏముంది అంటే...
ఎఫ్‌డీఏ నిషేదించిన ఈ శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉంది.
మిథనాల్ కలిగిన శానిటైజర్లను ఉయోగిస్తే ఆరోగ్యం చెడిపోతుంది.
కరోనా కంటే భయానకమైన సమస్యలు ఎదురవుతాయి.
శానిటైజర్‌ను చేతికి రాసుకున్నప్పుడు చర్మంలోకి వెళ్తుందని, ఆ చేతులతో ఆహారాన్ని తీసుకుంటే మిథనాల్ కడుపులోకి చేరుతుందని నిపుణులు తెలిపారు.

ఏ రకం శానిటైజర్ శ్రేయస్కరం అంటే..

వాడాల్సినవి: ఇథైల్‌ ఆల్కహాల్‌, ఐసో ప్రొపైల్‌ ఆల్కహాల్‌, ఎన్‌ ప్రొపైల్‌ ఆల్కహాల్‌ ఆధారితమైనవి.
వాడకూడనివి: మిథైల్‌ ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు.