Begin typing your search above and press return to search.

271 ఫేక్ లోన్ యాప్స్ ఇవే!

By:  Tupaki Desk   |   19 Sep 2022 3:53 AM GMT
271 ఫేక్ లోన్ యాప్స్ ఇవే!
X
అత్య‌వ‌స‌రాల కోసం ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా తీసుకుని వెంట‌నే రుణాల‌ను అందిస్తూ ఆ త‌ర్వాత అతి తీవ్ర వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాయి.. లోన్ యాప్స్‌. ఇప్ప‌టికే వీటి బారిన ప‌డి చాలామంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. వెంట‌నే త‌క్కువ స‌మ‌యంలోనే ఆన్‌లైన్ ద్వారా న‌గ‌దు అందిస్తూ.. ఆ త‌ర్వాత రుణ‌గ్ర‌హీత చెల్లించ‌డంలో కాస్త ఆల‌స్యం చేసినా లోన్ యాప్స్ నిర్వాహ‌కులు తీవ్ర మాన‌సిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. ఇక రుణం తీసుకున్న‌వారు మ‌హిళ‌లు అయితే తీవ్ర లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. లోన్ స‌కాలంలో చెల్లించ‌డం విఫ‌ల‌మ‌యితే రుణ‌గ్ర‌హీత ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పెడ‌తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాయి. ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉండే బంధువుల‌కు, స్నేహితుల‌కు రుణ‌గ్ర‌హీత గురించి చాలా చెడుగా ప్ర‌చారం చేస్తున్నాయి.

ఇప్ప‌టికే ఎంతోమంది వీటి బారిన‌ప‌డి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టంతో వీటికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఏపీ పోలీసు శాఖ ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లోన్ యాప్‌లపై నిఘా ఏర్పాటు చేశాయి. ప్రధానంగా చైనాలోని లోన్ యాప్స్ నిర్వాహ‌కులు మన దేశంలో అనధికారికంగా ఏజెంట్లను పెట్టుకుని ఈ దందా సాగిస్తున్నారు.

ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఈడీ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోన్ యాప్‌ కంపెనీల కార్యాలయాలపై విస్తృతంగా దాడులు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా యూపీఐ ఖాతాల ద్వారా చైనాకు కోట్లాది రూపాయ‌ల నిధులు తరలిస్తున్న వివిధ కంపెనీలను గుర్తించింది. చెన్నై, బెంగ‌ళూరు త‌దిత‌ర ప్రాంతాల్లోని ఆ కంపెనీల కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను పరిశీలించింది. దీంతో లోన్ యాప్స్ దారుణాలు బ‌ట్ట‌బ‌య‌లయ్యాయి. దీంతో ఆ ఫేక్‌ లోన్‌యాప్‌ కంపెనీల జాబితాలను అన్ని జిల్లాలకు పంపించి వాటి కార్యకలాపాలు అడ్డుకునేందుకు పోలీసు శాఖ సిద్ధ‌మైంది.

చైనాకు చెందిన లోన్‌యాప్‌ కంపెనీలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో తదితర నగరాల్లో అనధికారికంగా కేంద్రాలను ఏర్పాటు చేసి దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. లోన్ యాప్స్ సింపుల్‌గా, ఆకర్షణీయమైన ఇంగ్లిష్‌ పేర్లతో ఆకట్టుకునేలా ఉంటుండ‌టంతో ప్ర‌జ‌లు వీటిబారిన సులువుగా ప‌డుతున్నారు.

కాగా దేశంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 271 ఫేక్‌ లోన్ యాప్‌ కంపెనీలను ఆర్‌బీఐ గుర్తించింది. వాటి కార్యకలాపాల‌ను నిషేధించింది. వాటిపై పర్యవేక్షణను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు సమాచారమిచ్చింది.

క్రెడిట్‌బాక్స్‌ ఆల్ఫా లోన్‌ యాప్, ఫ్యూచర్‌ వాలెట్, హర్మనీ లోన్, నీడీ లోన్, సుగర్‌ మనీ, క్రెడిట్‌ కాయిన్‌ యాప్, లక్కీ లోన్‌యాప్, ర్యాపిడ్‌ పైసా, మనీ వ్యూ యాప్, డోవా క్యాష్‌ లోన్‌యాప్, కాయిన్‌ ట్రాక్, అవైల్‌ ఫైనాన్స్, హెల్ప్‌ మనీ అప్లికేషన్, అరేకో, క్రెడిట్‌ పెర్ల్, మే లోన్, ఫోర్ర్‌టెస్‌ లోన్‌యాప్, క్యాష్‌ క్రెడిట్, అరియకో లోన్, వాలెట్‌ ప్రో, కర్టెల్‌ లోన్, లక్కీ క్యాష్‌ లోన్, ఓకే రుపీ లోన్‌ అప్లికేషన్, హై క్రెడిట్‌ యాప్, సపోర్ట్‌ లోన్, క్విక్‌ మనీ యాప్, టాప్‌ క్యాష్‌ లోన్, ఈజీ బారో లోన్‌ యాప్, కార్ప్‌ వాలెట్, రూపీ బాక్స్, క్రెడిట్‌ మార్వెలెక్స్, రుపీరెడీ లోన్‌ యాప్, మెనీ లోన్, రుపీ పాకెట్, పే రుపీక్, క్రెడిట్‌ మార్వెల్, వాల్కనో లోన్, మోర్‌ లోన్, మేజిక్‌ లోన్, ఇన్‌స్టంట్‌ లోన్, ఎస్‌ క్యాష్, క్యాష్‌ అడ్వాన్స్‌ అటాచ్, ధన్‌ పల్, క్యాష్‌ హోస్ట్, రుపీక్, క్యాష్‌ మేనేజర్, ఫ్రీ లోన్, క్యాష్‌ అడ్వాన్స్‌ టీ1, క్యాష్‌కామ్, వాలెట్‌ ప్రో, వెల్‌ క్రెడిట్‌ గోల్డ్, హనీ లోన్, యూలవ్ట్‌ యాప్, హనీ లోన్‌యాప్, హ్యాండీ లోన్, క్యాష్‌ అడ్వాన్స్, లోన్‌ బ్రో లోన్‌యాప్, రుపీ హోమ్, క్రెజిబెన్, ఆ క్యాష్, క్రిస్టల్‌ లోన్, గోల్డ్‌ సీ, మనీ ట్యాంక్, యస్‌ రుపీస్, ఫ్లాష్‌ లోన్‌ యాప్, నీడ్‌ రుపీ, మామా లోన్‌యాప్, ధనీ, రెయిన్‌బో లోన్, క్విక్‌ క్యాష్, మనీ స్టాండ్, మనీ హౌస్, స్టే రుపీ, క్రెడిట్‌ రుపీ, క్యాష్‌ సమోసా, ఇన్‌ఫినిటీ క్యాష్, మే క్రెడిట్, లక్కీ లోన్, కిష్‌హ్ట్, రుఫిలో, మే లోన్‌యాప్, ఫ్లెక్స్‌లీ లోన్, మార్వెల్‌ లోన్, బాబా నాయక్‌ లోన్‌ ఫైనాన్స్, మినిట్స్‌ ఇన్‌ క్యాష్, బ్రో క్యాష్, గెట్‌ క్యాష్, డిస్కవర్‌ లోన్‌యాప్, క్యాష్‌ కౌ, ఈ–పైసా, షటిల్‌ లోన్, ఈఎస్‌ లోన్, ఆల్ఫా లోన్, హనీ లోనిన్, క్యాష్‌ లైట్, టాప్‌ క్యాష్, మాన్తా క్యాష్, ఓ క్యాష్, హలో బాక్స్, వల్లబై యాప్, జాస్మిన్‌ లోన్‌యాప్, అరాక్‌ లోన్, ఫాస్ట్‌ క్యాష్, ఓన్లీ లోన్, రుపియా బస్, లింక్‌ మనీ, లెండ్‌మాల్, క్రెడిట్‌ కింగ్, హై క్యాష్, యూపీఏ లోన్, గోల్డ్‌ మ్యాన్‌ పేబ్యాక్, హ్యాండీ లోన్, రుపీ కింగ్, మీ రుపీ, వన్‌ లోన్, క్యాష్‌ ఎనీ టైమ్, ఎక్స్‌ప్రెస్‌ లోన్, లోన్‌ డ్రీమ్, రుపీ లోన్, ఫ్లాష్‌ లోన్‌ మొబైల్, రుపీ స్టార్, వావ్‌ రుపీ, క్యాష్‌ పార్క్‌ లోన్, హూ క్యాష్, ఫస్ట్‌ క్యాష్, క్లియర్‌ లోన్, రుపీ బాక్స్, స్మాల్‌ లోన్, రిచ్, లోన్‌ గో, ఆసాన్‌ లోన్, లైవ్‌ క్యాష్, ఫాస్ట్‌ రుపీ, లోన్‌ ఫార్యూ్చన్, క్యాష్‌ పాకెట్, ఇన్‌స్టా లోన్, అప్పా పైసా, కోయిన్‌ రుపీ, క్యాష్‌ పాపా, లోన్‌ క్లబ్, హ్యాండ్‌ క్యాష్, లోన్‌ హోమ్‌ స్మాల్, ఐ క్రెడిట్, వెన్‌ క్రెడిట్, సమయ్‌ రుపీ, లెండ్‌ మాల్, సిల్వర్‌ పాకెట్, భారత్‌క్యాష్, మనీ మాస్టర్, ఈజీ లోన్, వార్న్‌ రుపీ, స్మార్ట్‌ కాయిన్, లక్కీ వాలెట్, యూపీవో లోన్‌.కామ్, బడ్డీ లోన్, క్యాష్‌ మైనే, టైటో క్యాష్, మై క్యాష్‌ లోన్, సింపుల్‌ లోన్, క్యాష్‌ మెషిన్‌ లోన్, ఫర్‌ పే, మినిట్‌ క్యాష్, ఫాస్ట్‌ పైసా, మోర్‌ క్యాష్, క్యాష్‌ బుక్, హ్యాండ్‌ క్యాష్‌ ఫ్రెండ్లీలోన్, రిలయబుల్‌ రుపీ క్యాష్, ఎర్లీ క్రెడిట్‌ యాప్, ఈగల్‌ క్యాష్‌లోన్‌ యాప్, క్యాష్‌ క్యారీ యాప్, క్యాష్‌ పార్క్, రిచ్‌ క్యాష్, ఫ్రెష్‌ లోన్, బెట్‌విన్నర్‌ బెట్టింగ్, రుపీ మాల్, సన్‌ క్యాష్, మినిట్‌ క్యాష్, బస్‌ రుపీ, ఓబ్‌ క్యాష్‌ లోన్, ఆన్‌ స్ట్రీమ్, క్యాష్‌లోన్, స్మాల్‌ లోన్, రుపయ బస్, ఇన్‌స్టా మనీ, స్లైస్‌ పే, లోన్‌ క్యూబ్, ఇకర్జా, మనీ స్టాండ్‌ ప్రో, పోక్‌ మనీ, క్వాలిటీ క్యాష్, లోన్‌ లోజీ, ఫర్‌పే యాప్, రుపీ ప్లస్, డ్రీమ్‌ లోన్, క్యాష్‌ స్టార్‌ మినిసో రుపీ, క్యాష్‌పాల్, ఫార్యూ్చన్‌ నౌ, క్రెడిట్‌ వాలెట్, పాకెట్‌ బ్యాంక్, లోన్‌జోన్, ఫాస్ట్‌ కాయిన్, స్టార్‌ లోన్, ఈజీ క్రెడిట్, ఏటీడీ లోన్, ట్రీ లోన్, బ్యాలన్స్‌ లోన్, క్యాష్‌ బౌల్, క్యాష్‌ కర్రీ, క్యాష్‌ మెషిన్, క్యాష్‌ పాకెట్‌ లైవ్‌ క్యాష్, క్యాష్‌ కోలా, 66 క్యాష్, కోకో లోన్, క్యాష్‌ హోల్, ఈజీ బారో క్యాష్‌ లోన్, ఐఎన్‌డీ క్యాష్‌ లోన్, వాలెట్‌ పేయి, క్యాష్‌ గురూ యాప్, గోల్డ్‌ క్యాష్, ఆరెంజ్‌ లోన్, ఏంజిల్‌ లోన్, లోన్‌ శాంతి, షార్ప్‌ లోన్, డెయిలీ లోన్, స్కై లోన్, మో క్యాష్, జో క్యాష్, బెస్ట్‌ పైసా, హెలో రూపీ, హాలిడే మొబైల్‌ లోన్, ఫోన్‌ పే లోన్, ప్లంప్‌ వాలెట్, క్యాష్‌ క్యారీ లోన్‌యాప్, క్రేజీ క్యాష్, క్విక్‌ లోన్‌యాప్, రాకెట్‌ లోన్, రుపీ మ్యాజిక్, రుష్‌ లోన్, బెలోనో లోన్‌యాప్, ఏజిల్‌ లోన్‌యాప్, క్యాష్‌ అడ్వాన్స్‌ 1, ఇన్‌కమ్‌ ఓకే, మేజిక్‌ మనీ, రుపీ పాపా, క్యాష్‌ ఎక్స్‌పీ, రుపీ ఓకే 1, క్యాష్‌ ఓకే, సన్‌షైన్‌ లోన్, క్రెడిట్‌ ఇట్‌ యాప్, పామ్‌రుపీ, ఈజీ ఆర్‌పీ, మనీ ల్యాడర్, ఎలిఫెంట్‌ క్యాష్, మ్యాజిక్‌ లోన్, క్యాష్‌ లోన్, పిళ్లై లోన్, క్రెడిట్‌ లోన్, రుపీ హాల్, ఇన్‌కం లోన్‌ యాప్, టాప్‌ క్యాష్, ఫ్లాష్‌ రుపీ, క్యాష్‌ స్టేషన్, రుపీ స్టార్, లింక్‌ మనీ, లోన్‌ హోమ్, రుఫిలో, మనీ స్టాండ్‌ క్రెడిట్‌ లోన్, బెలోన్‌ లోన్‌ యాప్, క్రెడిట్‌ మాంగో యాప్, పాపా మనీ లోన్‌యాప్, యోజన లోన్‌యాప్ త‌దిత‌రాలు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నాయ‌ని ఆర్‌బీఐ పేర్కొంది. వీటిలో లోన్లు తీసుకోవ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.