Begin typing your search above and press return to search.
కడప తమ్ముళ్లు బాబుకు హ్యాండిచ్చినోళ్లేనట
By: Tupaki Desk | 21 Jun 2019 5:58 AM GMTఏపీ తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవటం సంచలనంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారటం కొత్తేం కాదు. ఇప్పటికి ఎన్నోసార్లు ఇలా జరిగింది కూడా. తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న రాజ్యసభ సభ్యులు తర్వాతి కాలంలో మరో పార్టీలో మారటం ఎప్పుడూ ఉండేదని.. తాజాగా హిస్టరీ మరోసారి రిపీట్ అయ్యిందే తప్పించి కొత్త విషయమేమీ కాదన్న మాట వినిపిస్తోంది.
కడప జిల్లా నుంచి టీడీపీ తరఫున రాజ్యసభ్యులుగా ఎంపికైన వారంతా పార్టీ మారినోళ్లేనన్న మాట వినిపిస్తోంది. తాజాగా సీఎం రమేశ్ ఆ జాబితాలో చేరారు తప్పించి మరింకేమీ లేదని చెబుతున్నారు. ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన తులసిరెడ్డి.. చంద్రబాబు హయాంలో రాజ్యసభకు ఎంపికైన సి. రామచంద్రయ్య.. ఎంవీ మైసూరారెడ్డి.. తాజాగా సీఎం రమేశ్ అని.. ఇదేమీ కొత్త విషయం కాదంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిపోయే నేతలు.. తర్వాతి కాలంలో అవసరానికి తగ్గట్లు పార్టీలు మార్చేయటం కడప తమ్ముళ్లకు అలవాటేనన్న విమర్శ వినిపిస్తోంది. కడప జిల్లాకు చెందిన నేతకు రాజ్యసభ పోస్టు ఇచ్చినా అది పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదన్న పేరుంది. తాజా ఉదంతం అది నిజమని మరోసారి నిరూపించినట్లైందని చెప్పాలి.
కడప జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఐదుగురికి ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా నుంచి రాజ్యసభకు ఎంపికైన వారు ఏదో రీతిలో పార్టీలో మారటం ఆనవాయితీగా వస్తోంది. ఆ సెంటిమెంట్ మరోసారి సీఎం రమేశ్ రూపంలో రిపీట్ అయినట్లుగా చెబుతున్నారు. తాజా చేదు అనుభవం తర్వాత రానున్న రోజుల్లో కడప జిల్లా టీడీపీ నేతలకు రాజ్యసభ అవకాశం దక్కే ఛాన్స్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకూ పార్టీకి హ్యాండిచ్చిన కడప జిల్లా రాజ్యసభ సభ్యుల్ని చూస్తే..
+ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్న తులసిరెడ్డికి 1988లో ఎన్టీఆర్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అయితే.. ఆయన తర్వాతి కాలంలో బీజేపీలోకి.. అనంతరం కాంగ్రెస్‌లోకి చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కంటిన్యూ అవుతున్నారు.
+ కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్యకు రాజ్యసభ సభ్యులుగా టీడీపీ రెండుసార్లు అవకాశం ఇచ్చింది. అలాంటి ఆయన 2009లో పార్టీకి రాజీనామా చేసి పీఆర్పీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
+ టీడీపీ సీనియర్ నేతగా సుపరిచితుడు మైసూరారెడ్డి 2004 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు చంద్రబాబు. తర్వాతి కాలంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
+ కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత రాముమునిరెడ్డికి 2000లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. 2006 వరకుఆ పదవిలో ఉన్న ఆయన తర్వాతి కాలంలో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
+ తాజాగా సీఎం రమేశ్ విషయానికి వస్తే.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ.. బాబుకు నేరుగా సలహాలు, సూచనలు ఇస్తారన్న పేరుంది. అలాంటి సీఎం రమేశ్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఇటీవల ఎంపిక చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యాల్ని మూటగట్టుకోవటంతో బీజేపీలో చేరారు.