Begin typing your search above and press return to search.
బీజేపీలో ఆందోళన పెంచుతున్న 160 సీట్లు ఇవే!
By: Tupaki Desk | 27 Dec 2022 11:30 PM GMT2014, 2019ల్లో వరుస ఘన విజయాలు సాధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చింది. మరో పార్టీ అవసరం లేకుండానే ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2014ను మించిన ఘన విజయాన్ని 2019లోనూ నమోదు చేసింది. అయితే ఈసారి 2024లో మాత్రం బీజేపీ విజయం నల్లేరుపై నడక కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా 160 సీట్లలో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీ చేయించుకున్న సర్వేలోనూ ఇదే తేలిందని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రాల్లోనే ఈ 160 సీట్లు ఉండటం గమనార్హం.
ముఖ్యంగా బీహార్, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ ల్లో బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం. అలాగే బీహార్ లో సైతం గతంలో జేడీయూతో పలుమార్లు అధికారంలో భాగస్వామిగా ఉంది.
బీజేపీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న 160 సీట్లలో బీహార్ 10 సీట్లు, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్ 10, అసోం, తెలంగాణ 5, పంజాబ్ మూడు ఉన్నట్టు బీజేపీ అంతర్గత సర్వేలోనే తేలినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ లో ఈసారి బీజేపీకి గట్టి దెబ్బ తప్పదని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 స్థానాల్లో 21 స్థానాలను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
పెద్ద రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ల్లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్లోనూ ఒక సీటులో కఠిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.
బీజేపీ సీనియర్ ఆఫీస్ బేరర్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ 160 సీట్లలో తాజా పరిస్థితిపై చర్చించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న జరిగిన ఆఫీస్ బేరర్ల భేటీలో సమీక్ష నిర్వహించిన బీజేపీ కీలక నేతలు డిసెంబర్ 28న మరోమారు సమావేశమై ఈ సీట్లపై చర్చించబోతున్నారు.
ఈ మొత్తం 160 సీట్లలో 100 సీట్లపై డిసెంబర్ 21న బీజేపీ నేతలు సమీక్షించారు. డిసెంబర్ 28న మరో 60 సీట్లపై సమీక్షించనున్నారు. హైదరాబాద్‌లో ఈ సమీక్ష జరుగుతుంది.
కాగా ఈ సమావేశంలో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న 160 సీట్లలో పార్టీ పరంగా అనుసరించాల్సిన విధానాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి నుంచి సంస్థాగత నిర్మాణం, ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై సమీక్షించనున్నారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.