Begin typing your search above and press return to search.

కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయిన దేశాధినేతలు వీరే

By:  Tupaki Desk   |   21 May 2021 9:37 AM GMT
కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయిన దేశాధినేతలు వీరే
X
విపత్తులు అనేవి ముందస్తు హెచ్చరికతో రావు. అవి వచ్చిన సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు పాలకులు కూడా చురుకుగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజలకు నమ్మకంను ధైర్యంను కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలి. విపత్తు గురించి హెచ్చరిస్తూనే మరో వైపు ఆందోళన చెందనక్కర్లేదనే ధైర్యంను ఇచ్చినప్పుడు మాత్రమే ఆ నాయకుడు సఫలం అయినట్లు. ప్రజల్లో చైతన్యం కలిగించడం మొదలుకుని విపత్తును ఎదుర్కొనే వరకు నాయకుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కరోనా విపత్తు వేల కొందరు దేశాది నేతలు పూర్తిగా విఫలం అయ్యారు. దాంతో కేసుల సంఖ్య ఆయా దేశాల్లో లక్షల్లో నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంకు కారణం దేశాధినేతల అసమర్థత అంటూ ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కేసులు అత్యధికంగా నమోదు అయిన దేశాల్లో ప్రభుత్వ వైఫల్యం క్లీయర్ గా కనిపిస్తుంది. ప్రధాని లేదా అధ్యక్షులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు మరియు వారు చేపట్టిన కార్యక్రమాల వల్లే కేసులు పెరిగాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో అయిదు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉన్నాయి.. మృతుల సంఖ్య కూడా ఆ అయిదు దేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో ఆరంభంలో కరోనా కేసులు అధికంగా ఉన్నా కూడా పాలకులు సమర్థవంతంగా పని చేయడంతో పాటు అధికారులు మరియు ప్రజలు కూడా అవగాహణతో కరోనాను జయించారు. కొన్ని దేశాలు ఇప్పటికే కరోనాను పూర్తిగా జయించాయి.

పెద్ద దేశాలు చిన్న దేశాలు అని కాకుండా దేశాధినేతలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అయిదు దేశాలు బాగా ఎఫెక్ట్‌ అయ్యాయి. అందులో ప్రథమంగా అమెరికా ఉంటుంది. చిన్న దేశమే అయినా కూడా అక్కడ కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ లేదా ఆంక్షలు వంటివి అమలు చేయక పోవడం వల్ల కేసుల సంఖ్య అంతకంతకు పెరిగింది. ట్రంప్ ప్రెసిడెంట్‌ గా ఉన్న సమయంలో కరోనా పై సాగించిన పోరాటం శూన్యం అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేసి ఆయన్ను ఎన్నికల్లో ఓడించిన విషయం తెల్సిందే. ట్రంప్‌ విఫలం అవ్వడం వల్లే అమెరికాలో కేసుల సంఖ్య అంతగా పెరిగాయనేది నిపుణుల వాదన.

అమెరికా తర్వాత అత్యధికంగా కేసులు నమోదు అయిన దేశం ఇండియా. ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌ డౌన్‌ అవసరం అయిన సమయంలో అమలు చేయకుండా కేసులు వందల్లో ఉన్న సమయంలో లాక్‌ డౌన్ ను అమలు చేయలేదు. పైగా కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి హెచ్చరిస్తూనే ఉన్నా దేశ వ్యాప్తంగా ఆయన తీసుకున్న చర్యలు శూన్యం. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పక్రియను ఆయన స్పీడ్‌ గా చేయించడంలో కూడా సరైన వ్యూహంను అమలు చేయలేక పోయారు. ట్రంప్ మోడీ మాత్రమే కాకుండా బ్రెజిల్‌ ప్రెసిడెంట్ జైర్‌ బొల్సనారో.. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో.. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యూయెల్‌ లోపెజ్‌ లు కూడా కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయ్యారు అంటూ అంతర్జాతీయ సమాజం విమర్శలు గుప్పిస్తుంది. కరోనా కేసులు తక్కువ సమయంలో ఈ దేశాధినేతలు సరైన నిర్ణయాలు తీసుకోక పోగా కేసులు పెరిగిన తర్వాత కూడా సరైన రీతిన స్పందించలేదు. అందుకే ఈ దేశాధినేతల రాజకీయ భవిష్యత్తును కరోనా ప్రభావితం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.