Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

By:  Tupaki Desk   |   18 Dec 2020 9:44 AM GMT
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
X
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ ఉదయం 11 గంటలకు మొదలైన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రి వర్గం తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ముఖ్యంగా రైతు భరోసా పథకం.. ఇన్ ఫుట్ సబ్సిటీ నేరుగా ఆర్టీజీఎస్ చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్సీ) సంస్థ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ ఫుట్ సబ్సిడీని ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా చెల్లింపులు చేయాలని.. ఏ సీజన్ పరిహారం ఆ సీజన్ లోనే చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇక ఏపీలో కొత్త పర్యాటక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. హోటల్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు సాయం చేయాలని నిర్ణయించింది. 198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీనిచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో 3910 పర్యాటక సంస్థలకు ఆర్థికంగా లబ్ధి కలుగనుంది.

సమగ్ర భూ సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్.. ప్రతి సరిహద్దుకి జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. సమగ్ర ల్యాండ్ రికార్డులు తయారు చేయడం ద్వారా రైతు హక్కులకు రక్షణ కల్పించాలని డిసైడ్ అయ్యింది.

ఇక పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మెడికల్ కాలేజీల ఏర్పాటు, అభివృద్ధికి రూ.16వేల కోట్ల నిధులను మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇక తిరుపతిలో సర్వే ట్రైనింగ్ కాలేజీ ఏర్పాటుకు 40 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.