Begin typing your search above and press return to search.
మోడీ అజెండా లో కీలక అంశాలు ఇవే నా !
By: Tupaki Desk | 12 Nov 2019 11:09 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లోని బీజేపీ పార్టీ రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ నాటి నుంచే పార్టీ ఎజెండా లో పేర్కొన్న ఒక్కొక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి పరిష్కరిస్తుందని రాజకీయ పండితులు ముందు గానే భావించారు. దాన్ని నిజం చేస్తూ మోదీ ప్రభుత్వం, కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగం లోని 370 వ అధికరణను రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
ఇక ఆ తరువాత ఎన్నికల ప్రచారం లో చెప్పినట్టే అయోధ్య వివాదాన్ని కోర్టు సహకారం తో పరిష్కరించింది. అయోధ్య లో రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళిక లో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటి కీ అది ఇంత సులభం గా సాధ్యం అవుతుందని ఎవరూ ఊహించ లేదు. ఇక ఇప్పుడు బీజేపీ అజెండా లోని ఏ అంశాలు పరిష్కారానికి ముందుకు రానున్నాయి. అసోం నుంచి బంగ్లాదేశ్ ముస్లిం శరణార్థులను వెనక్కి పంపించేందుకు చేపట్టిన కసరత్తు గత రెండు, మూడేళ్లు గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.
దాదాపు 20 లక్షల మంది ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమం గా అస్సాం లో ఉంటున్నట్లు 'జాతీయ పౌరసత్వం నమోదు' కార్యక్రమం తేల్చింది. ఇందు లో ముస్లింల ని కాకుండా మిగతా వారికీ భారత దేశం పౌరసత్వం ఇచ్చి .. ముస్లింల ను బంగ్లాదేశ్ కు పంపించాలని బీజేపీ భావిస్తుంది. ముస్లిం మహిళల కోసం 'ట్రిపుల్ తలాక్'ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశం లోని అన్ని మతాల వారికి వర్తించే 'ఉమ్మడి పౌర స్పృతి' ని తీసుకురానుంది. ఆ తర్వాత పటిష్టమైన మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకరానుంది. ప్రస్తుతం రాష్ట్రాల వారి గా ఈ చట్టాలు ఉన్నాయి. కేంద్ర స్థాయి లో లేదు.