Begin typing your search above and press return to search.

మినహాయింపుల లిస్ట్ లో మరికొన్నింటిని చేర్చిన కేంద్రం !

By:  Tupaki Desk   |   17 April 2020 11:30 PM GMT
మినహాయింపుల లిస్ట్ లో మరికొన్నింటిని చేర్చిన కేంద్రం !
X
కరోనా మహమ్మారి ప్రభావం అంత లేని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్-20తర్వాత పలురంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మినహాయింపుల లిస్ట్ లో కొత్తగా మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ లను ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తిస్తూ వాటికి ఏప్రిల్- 20 నుంచి లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.

దీనితో ఏప్రిల్ 20 తరువాత , ఈ సంస్థలు కూడా తమ పనులని ప్రారంభించనున్నాయి. షెడ్యూల్డ్ తెగలవాళ్లు చేసే అటవీ ఉత్పత్తులు,వక్కమరియు కోకో తోటలు - కొబ్బరి - స్పైస్ బాంబో లను ఆంక్షల సడలింపు లిస్ట్ లో చేర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మరియు పారిశుధ్యం మరియు విద్యుత్ లైన్లు మరియు టెలికాం ఆప్టికల్ ఫైబర్స్ మరియు కేబుల్స్ వేయడం కూడా అనుమతించబడుతుందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తెలిపింది.

గ్రాసరీస్,మెడిసిన్స్ వంటి అవసరమైన వస్తువులతో కలిపి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, బట్టలు మరియు పాఠశాల విద్యార్థుల కోసం స్టేషనరీ వస్తువులను అమెజాన్ - ఫ్లిప్‌ కార్ట్ మరియు స్నాప్‌ డీల్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ ఫామ్‌ ల ద్వారా అమ్మవచ్చు అని కేంద్రం ఇప్పటికే స్పష్టం చెప్పింది. అయితే ఈ-కామర్స్ కంపెనీలు తమ వాహనాలు రోడ్లపై తిరిగేందుకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. అలాగే ముఖ్యంగా పని ప్రదేశాల్లో సామాజికదూరం పాటాంచాల్సిందేనని, ఇతర ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది.