Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రయోజనాలే లక్ష్యంగా హైకోర్టు ఉత్తర్వులు ఇవేనట!!

By:  Tupaki Desk   |   11 Oct 2020 5:02 AM GMT
చంద్రబాబు ప్రయోజనాలే లక్ష్యంగా హైకోర్టు ఉత్తర్వులు ఇవేనట!!
X
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణకు టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యనున్న అనుబంధాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందజేసిన పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు తాజాగా విడుదల చేయటం తెలిసిందే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాల్ని మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరో సంచలన అంశాన్ని అజేయ్ కల్లం వెల్లడించారు.

టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. ఈ మధ్య కాలంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని ఏకరువు పెట్టింది. సుప్రీం సీజేకు అందజేసిన అనుబంధ పత్రాల్లో వీటి వివరాల్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ వివరంగా పేర్కొంది. ఆ మీడియా సంస్థ ప్రచురించిన అంశాల్ని యథాతధంగా చూస్తే..

- గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్‌ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే.

- అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్‌ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది.

- కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ద్వారా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది.

- చంద్రబాబు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్‌ రోస్టర్‌ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ డి.రమేశ్‌ తదితరులు ఉన్నారు. న్యాయం వైపు లేకున్నా.. హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్‌ను అనుమతించారు.