Begin typing your search above and press return to search.
ఎస్ 9 బోగి ప్రయాణికులు వీరే..
By: Tupaki Desk | 20 March 2020 8:10 AM GMTఒక్కసారిగా కరోనా 8 పాజిటివ్ కేసులు నమోదవడం తో తెలంగాణ ఉలిక్కిపడింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే అది కొందరి తప్పిదం వలన ఆ విధంగా ఏర్పడిందని తెలిసింది. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారు రైలులో ప్రయాణించి తెలంగాణకు చేరుకున్నారని గుర్తించి.. వారిని ఆస్పత్రికి తరలించడం తో ఆ కేసులు నమోదయ్యాయి. అయితే వారిలో తెలంగాణ పౌరుడు ఎవరూ లేకపోవడం విశేషం. అయితే వారు ప్రయాణించిన రైలులో ఉన్న ప్రయాణికులపైనే ఆందోళన కలుగుతోంది. వారు ప్రయాణించిన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో ఎస్ 9 బోగిలో ఉన్న ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆ బోగిలో ఎవరు ప్రయాణించారు? ఎక్కడ దిగారు? వారి ఆరోగ్యం ఎలా ఉందనే వివరాలు ఆగమేఘాల మీద ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ నుంచి మార్చి 13వ తేదీన రామగుండం వరకు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ బోగిలో కరోనా పాజిటివ్ బాధితులు 8మంది ప్రయాణించారు. ఆ సమయం లో వారితో పాటు ఎస్ 9 బోగిలో ప్రయాణికుల వివరాలు కొంత తెలిశాయని సమాచారం. ఆ ప్రయాణికుడి తో కలిసి ప్రయాణం చేసిన వాళ్లను, ఆ బోగీలో ప్రయాణం చేసిన ప్రయాణికులను గుర్తించే ప్రయత్నం చేసింది. వారిలో 10 మంది ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ పదిమంది కరీంనగర్ వెళ్లారు. ఇందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇండోనేషియాకు చెందిన ఏడుగురితో పాటుగా, రామగుండంలో దిగిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలడం తో ఆ బోగీలో ప్రయాణం చేసిన మిగతా వారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది.
ఈ క్రమంలో ఆ రైలులో ఎస్ 9 బోగి నుంచి ప్రయాణికులు ఎక్కడ దిగారో కొంత సేకరించారంట. దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం.. మొత్తం 90 మంది 13 స్టేషన్లలో దిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఝాన్సీ 4, భోపాల్ 6, నాగ్పూర్ 4, రామగుండం 14, కాజీపేట 4, కాచిగూడ 33, మహబూబ్నగర్ 1, కర్నూలు 11, ఎర్రగుంట్ల 4, కడప 3, డోన్ 2, రేణిగుంట 1, తిరుపతిలో ముగ్గురు దిగినట్టు వెల్లడైంది. ఆ జాబితాను తీసుకుని వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రయాణికుల ఫోన్ నంబర్లు, పేర్లు తీసుకొని వారిని సంప్రదిస్తున్నారు. వారిని గుర్తించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోనున్నారు. వారికి కరోనా సోకిందంటే వెంటనే అదుపులోకి తీసుకుని ఆ వైరస్ వ్యాప్తి తీవ్రంగా కాకుండా చర్యలు తీసుకోనున్నారు. అయితే దీంతోపాటు ప్రభుత్వం మార్చి 13వ తేదీన సంపర్క్ క్రాంతి్ ఎస్ 9 బోగిలో ప్రయాణించిన వారంతా స్థానికంగా ఉన్న పోలీసులకుగానీ, లేదా వైద్యాధికారులను వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు. కరోనా నివారణకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.