Begin typing your search above and press return to search.

కిడ్నీ పేషెంట్లు తినకూడనివి ఇవే..!

By:  Tupaki Desk   |   3 March 2021 3:30 PM GMT
కిడ్నీ పేషెంట్లు తినకూడనివి ఇవే..!
X
ఇటీవల కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతున్నది. ముఖ్యంగా చాలా మందికి కిడ్నీల్లో రాల్లు ఏర్పడుతున్నాయి. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీల్లో స్టోన్స్ వచ్చినవాళ్లకు భరించలేని నొప్పి ఉంటుంది. అయితే కిడ్నీల్లో స్టోన్స్​ తీసేయడానికి పలు రకాల చికిత్సలు అందుబాటులో వచ్చాయి. అయినప్పటికీ ఒక్కసారి కిడ్నీల్లో స్టోన్స్​ తొలగించినా.. మళ్లీ.. మళ్లీ ఈ సమస్య వస్తూనే ఉంది. దీంతో కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉంటే కిడ్నీ స్టోన్స్​ సమస్య పునరావృతం కాకుండా జాగ్రత్త వహించవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.. అవేమిటో ఇప్పడు చూద్దాం..

కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి.. మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్ లేదా భాస్వరం వంటి రసాయనాలతో కలిస్తే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. మూత్రపిండాలలో యూరిక్ యాసిడ్ ఏర్పడటం తరచుగా మూత్రపిండాల్లో స్టోన్స్ కు కారణమని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలిపింది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు బచ్చలికూరను తీసుకోవద్దు. ఈ ఆకుకూరలో ఉండే ఆక్సలేట్​ రక్తంలోని కాల్షియంతో కలుస్తుంది. దాన్నీ మూత్రపిండాలు వాటిని ఫిల్టర్​ చేయలేవు. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

బచ్చలికూరతో పాటు, బీట్‌రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ వంటి వాటిల్లోనూ ఆక్సలేట్ ఉంటుంది. ఇవి కూడా తినొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. రెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు వంటివి కూడా తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. వీటివల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కనుక కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఈ ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. వీటితోపాటు వంటల్లో ఉప్పును కూడా తక్కువగా వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాక కూల్​డ్రింక్స్​కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.