Begin typing your search above and press return to search.
భారత ఆర్థిక వ్యవస్థ క్షిణించడానికి మోడీ సర్కార్ చేసిన ఆ మూడు తప్పులు ఏవంటే !
By: Tupaki Desk | 20 Feb 2020 7:00 AM GMTదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో వినిమయం గణనీయంగా పడిపోతోంది. డిమాండు తగ్గి ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమన ఛాయలు అలముకుంటున్నాయి. కానీ , మోడీ సర్కార్ దాన్ని ఒప్పుకోవడానికి సముఖత వ్యక్తం చేయడంలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందంటూ చెప్తూ కాలం వెళ్లదీస్తుంది. మోడీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి RBI మాజీ గవర్నర్ వై.వేణుగోపాల్ రెడ్డి మూడు ప్రధాన కారణాలను చెప్పార .
అ మూడు కారణాలు ఏవి అంటే ... మొదటిది స్థూల జాతీయోత్పత్తి. గత ఆరు త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ వస్తుండటం. అలాగే రెండోదిగా ఆర్థిక రంగంలో ఉన్న లోటు పాట్లపై సరైన వ్యూహం తో ముందుకెళ్లడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది అని తెలిపారు. ఇక మూడో కారణం ..దేశంలోని యువతకి ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయ్యిందని చెప్పారు. జీడీపీ గణాంకాలు నిజంగానే క్షీణించాయని ఈ నిజాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందేనని అయన తెలిపారు. ఆర్థిక రంగం ఇబ్బందుల్లో ఉందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ,ఇదే విషయాన్ని కాగ్ కూడా వెల్లడించిందని గుర్తు చేశారు. ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైన ఈ మూడు విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ..ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వం గాడి తప్పిందన్న విషయం స్పష్టం అవుతుందని , ఆ తరువాత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు.
ఇక దేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే మోడీ సర్కార్ మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేదని , ఇక క్షీణించిన ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సంస్కరణలు తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అయితే ఆ సంస్కరణలు సరిగ్గా ఉండాలని హితవు పలికారు. సంస్కరణల పేరుతో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మళ్లీ అది పెద్ద చర్చకు దారి తీస్తుందన్నారు. దీన్ని ఒప్పుకోవడానికి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా సిద్ధంగాలేరు అని తెలిపారు. ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ..ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకొని, ఆ విషయాన్ని గ్రహించి వెంటనే , దాని నుండి బయటపడటానికి చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితి నుంచి బయటపడతామని , లేకపోతే వచ్చే రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు అని తెలిపారు. త్రస్థాయిలో పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేయలేకపోతున్న కేంద్రం, తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉందంటూ చెప్తుంది అని , వాస్తవ పరిస్థితులను చూస్తే మాత్రం దేశ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలోనే ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.