Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ ఔట్.. అర్నల్డ్ టాప్ : ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే
By: Tupaki Desk | 15 Dec 2022 3:30 PM GMTఓవైపు కరోనా భయాలు.. మరోవైపు మాంద్యం మబ్బుల్లో కుబేరుల స్థానాలు తారుమారు అవుతున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచంలోనే నంబర్ 1గా ధనవంతుడు ఎలన్ మస్క్ ట్విటర్ ను కొన్నాక తన స్థానం కోల్పోయారు. తాజాగా ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్డ్ నిలిచాడు. ఏకంగా ఎలన్ మస్క్ ను అధిగమించి 185.3 బిలియన్ల డాలర్ల నికర సంపదతో మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే కొత్తగా తారుమారైన ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాను ఒకసారి చూద్దాం. మన భారత కుబేరుడు గౌతం అదానీ ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు.
1. బెర్నార్డ్ అర్నల్ట్
బెర్నార్డ్ అర్నల్ట్ $172.9 బిలియన్ల నికర విలువతో ఇప్పటివరకూ ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడిగా ఉన్న వ్యాపారవేత్త టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ను అధిగమించాడు. అర్నల్డ్ ఫ్రెంచ్ వ్యాపారవేత్త. లూయిస్ విట్టన్, హెన్నెస్సీ, మార్క్ జాకబ్స్ , సెఫోరా వంటి ఎల్.వీఎంహెచ్ బ్రాండ్‌లకు సీఈవోగా ఉన్నారు. ఆయన తన సంపదతో నంబర్ 1 ర్యాంకులోకి చేరుకున్నారు.
2. ఎలోన్ మస్క్
టెస్లా వ్యవస్థాపకుడు, ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌ని కొనుగోలు చేశారు. దాంతోనే దిగజారిపోయారు. నంబర్ 1 ర్యాంకును కోల్పోయారు. ఇప్పుడు ఎలన్ మస్క్ నికర విలువ $168.5 బిలియన్లు. మస్క్ అంతరిక్ష ప్రయోగ రాకెట్ల డెవలపర్ అయిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ (స్పేస్‌ఎక్స్) సీఈవోగా ఉన్నారు. ఇక టెస్లా కార్ల కంపెనీకి అధినేతగా ఉన్నారు.
3. గౌతమ్ అదానీ
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్ , అదానీ ట్రాన్స్‌మిషన్స్ యాజమాన్యం వ్యవస్థాపకులు. గౌతమ్ అదానీ 125 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడు. ప్రపంచంలోని 3వ సంపన్నుడు
4. బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 115 బిలియన్ డాలర్ల నికర సంపదతో 4వ స్థానానికి పడిపోయారు.
5. జెఫ్ బెజోస్
ఇ-కామర్స్ దిగ్గజం 'అమెజాన్' సీఈవో ప్రపంచంలోని ప్రముఖ ధనవంతులలో 5వ స్థానంలో ఉన్నారు. అతను ఒక సంవత్సరం క్రితం జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను అమెజాన్‌లో అతని 10% వాటా ($89.9 బిలియన్) నుంచి వచ్చిన డబ్బు వల్ల $114 బిలియన్ల సవరించిన నికర విలువను కలిగి అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
6. వారెన్ బఫెట్
తక్కువ విలువ లేని కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా తన సంపదను సృష్టించిన బఫెట్ ఇప్పుడు $108 బిలియన్ల నికర సంపదను కలిగి ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం అదానీ, బిల్‌గేట్స్‌ను దాటేసి అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి తాజాగా తన ర్యాంకును కోల్పోయాడు.
7.లారీ ఎల్లిసన్
ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నికర విలువ $93.7 బిలియన్లు, ఇందులో అతను టెస్లా ఈక్విటీ $7.56 బిలియన్ పబ్లిక్ ఆస్తి .. $17.2 బిలియన్ నగదును కలిగి ఉన్నాడు.
8. ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ నికర విలువ $89.6 బిలియన్లతో రెండవ అత్యంత సంపన్న భారతీయుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ మరియు ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి.
9. స్టీవ్ బాల్మెర్
లాస్‌ఏంజెల్స్ క్లిప్పర్స్ యజమాని స్టీవ్ బాల్మెర్ 89.3 బిలియన్ డాలర్ల సంపదతో 9వ స్థానంలో నిలిచారు.
10. లారీ పేజీ
'ఆల్ఫాబెట్' (గూగుల్) సహ వ్యవస్థాపకుడు, లారీపేజ్ నికర విలువ $86.9 బిలియన్లు. 1998లో గూగుల్‌ను స్థాపించిన వ్యక్తి కూడా ఆయనే.
ఇలా టాప్ 10 ధనవంతుల కొత్త జాబితా విడుదలైంది. ఎలన్ మస్క్ తన ఫస్ట్ ర్యాంకును కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.