Begin typing your search above and press return to search.
కొలువుదీరిన కొత్త కేబినెట్ ఇదే..
By: Tupaki Desk | 8 Jun 2019 8:57 AM GMTఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 రోజుల తర్వాత జగన్ తన కేబినెట్ ను విస్తరించారు. శనివారం అమరావతిలోని వెలగపూడిలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఏపీ మంత్రులుగా 25మంది ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఈ మంత్రుల చేత ప్రమాణం చేయించారు. ఈ 25మంది మంత్రుల్లో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం.
మే 30న వైఎస్ జగన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటినుంచి 9 రోజుల తర్వాత తన మొత్తం కెబినెట్ ను విస్తరించి 25మందిని మంత్రులుగా ఎంపిక చేశారు. మొత్తం 25మంది మంత్రుల్లో ఆరుగురు మంత్రులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్ తండ్రి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రులుగా చేయడం విశేషం. మిగతా అందరూ మొదటి సారి మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ ఉదయం 11.49 గంటలకు ప్రారంభమైన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మొదట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా ఆదిమలుపు సురేష్, ఎం గౌతమ్ రెడ్డి లు ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. మిగత అందరూ తెలుగులోనే చేయడం విశేషం.
కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా మైనార్టీ కోటాలో మంత్రి అయ్యారు. ఈయన అల్లా మీద ఒట్టేసి ప్రమాణం చేశారు.
ఇక డిప్యూటీ సీఎంలుగా ఐదుగురికి అవకాశం ఇస్తానన్న జగన్.. సామాజిక కుల సమీకరణాలను బట్టి వారి పేర్లను, శాఖలను రేపు ప్రకటించనున్నారు.
జగన్ కేబినెట్ లో 60శాతం మంత్రులుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉండడం ప్రశంసించదగ్గ విషయంగా ఉంది. 11 మంది అగ్రవర్ణాల్లో రెడ్డి-4, కమ్మ1, కాపు 4, క్షత్రియ 1 మంత్రులుగా చేరారు.
వైఎస్ కేబినెట్ లో మంత్రులుగా చేసిన బొత్స, పి. సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, మోపిదేవి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డిలు జగన్ కేబినెట్ లోనూ మంత్రులుగా చేరడం విశేషం.
ఇందులో సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఇద్దరు వైసీపీ తరుఫున ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయినా.. జగన్ వారిని ఎమ్మెల్సీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకోవడం విశేషం.