Begin typing your search above and press return to search.

రిపోర్ట్.. పార్టీ ఫండ్ ఇచ్చిన ఖర్చు చేయరా?

By:  Tupaki Desk   |   17 April 2019 4:38 AM GMT
రిపోర్ట్.. పార్టీ ఫండ్ ఇచ్చిన ఖర్చు చేయరా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ఆయా పార్టీల నాయకుల విశ్లేషణ పనిలో పడ్డారు. పోలింగ్‌ ఎలా జరిగింది..? ఎవరెవరు ప్రచారం కోసం కష్టపడ్డారు..? ఎవరు పార్టీ గెలుపుకోసం కృషి చేశారు..? అనే అంశాలపై అటు వైసీపీ, ఇటు టీడీపీ అధినేతలు ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకున్నారట. ఇరు పార్టీల్లో ఎంతమంది పార్టీ, వ్యక్తిగతంగా విజయం కోసం పనిచేశారని అధినేతలు ఆరా తీశారట. అయితే బెజవాడలోని ఐదుగురు నేతలు అభ్యర్థులు పోలింగ్‌ చివరి రోజు పోల్‌ మేనేజ్‌మెంట్‌ ను పట్టించుకోలేదట. ప్రచారం కోసం కనీస ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహిరించారట. దీంతో అక్కడి అభ్యర్థుల గెలుపుపై అవకాశాలు తగ్గాయని టాక్‌ వినిపిస్తోంది.

ఏపీలో ఎన్నికల ప్రచారం ఈసారి ఉధృతంగా సాగింది. టీడీపీ, వైసీపీలు అన్ని అస్త్రాలు ప్రయోగించాయి. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి పెట్టాయి. ప్రచారం జరిగిన సమయంలో ఎలా జరుగుతోంది..? అక్కడి అనుకూలతలు, ప్రతికూలతలేంటి..? అనే విషయాలపై ఎప్పటికప్పుడు అదినేతలు చెక్‌ చేసుకున్నారు. లోపాలపై తమ అభ్యర్థులను అలర్ట్‌ చేశాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రచార పర్వంలో భాగంగా రోజుకు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థులు ఎలా ప్రచారం చేస్తున్నారని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఆదరిస్తున్నారా..? అనేది పరిశీలించడానికి నియోజకవర్గానికి ఒకరిని చొప్పున నియమించారు. వారు ఎప్పటికప్పుడు పార్టీ అధినేతలకు రిపోర్టు అందించేవారు.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలోని ఐదుగురు నేతలకు పార్టీ నేతలు క్లాస్‌ ఇచ్చారట. టీడీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు, వైసీపీకి చెందిన ఇద్దరు క్యాండెట్లు ప్రచారంలో వెనుకబడ్డారట. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఇరు పార్టీల అభ్యర్థులు హోరా హోరీ ప్రచారం నిర్వహించారు. అయితే పోలింగ్‌ ముందురోజు వారు ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోలేదట. పోల్‌ మేనేజ్‌ మెంట్‌ సరిగా చేయడం లేదని వారి పార్టీ అధినేతలు వార్నింగ్‌లు ఇచ్చారట.

అయితే అభ్యర్థులు మాత్రం అధినేతల సూచనలను అస్సలు పట్టించుకోలేదట. అభ్యర్థులు పార్టీ ఫండ్‌ గా వచ్చిన డబ్బును కూడా ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని, ఎన్నికల పరిశీలకులు నివేదికలు ఇచ్చారట. దీంతో కేడర్‌ అసంతృప్తిగా ఉందట. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడలో తమ పుట్టి మునిగేలా ఉందని.. ఎవరు గెలుస్తారోనన్న టెన్షన్ వైసీపీ, టీడీపీలను వెంటాడుతోంది.