Begin typing your search above and press return to search.
వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ ఈ నేతలకు షాకులే...!
By: Tupaki Desk | 25 Nov 2022 2:30 AM GMTఏపీలో అధికార, ప్రతిపక్షాల రెండు కూడా వచ్చే ఎన్నికల్లో విజయందక్కించుకుని దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ తమ వ్యూహాలను ప్రయోగిస్తున్నారు. శర వేగంగా పార్టీల అధినేతలు పావులు కదుపుతున్నారు. ఒక ఎత్తు వేస్తే.. మరొకరు పై ఎత్తు వేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య కూడా రాజకీయాలు చాలా హీటెక్కాయనే ది కళ్లకు కడుతున్న వాస్తవం.
అయితే, అధినేతల దూకుడుకు.. పార్టీ నాయకులు ఏమేరకు పుంజుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో వైసీపీ తనపై చేసిన విమర్శలకు చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది.
చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ.. మాజీ మంత్రి కొడాలి నాని.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు వయసు అయిపోయిందని... వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీలో చాలా చాలా తక్కువ మంది మాత్రమే రియాక్ట్ అయ్యారు. దీంతో స్వయంగా చంద్రబాబు తన వయసు అయిపోలేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది.
వైసీపీ విషయానికి వస్తే.. తమ పార్టీ రౌడీ పార్టీ అంటూ.. జనసేన అధినేత పవన్ ప్రకటించారు. అదేసమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా `ఇదేం ఖర్మ` కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రెండు సందర్భాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ స్పందిస్తుందని సీఎం జగన్ భావించారు. కానీ, ఎక్కడా ఆ తరహా ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయనే ఇప్పుడు ఎక్కడ సభ పెట్టినా వాటిని ప్రస్తావించి కౌంటర్లు ఇస్తున్నారు.
ఇలా.. రెండు పార్టీల్లోనూ నాయకులు.. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదన వినిపిస్తోంది.దీంతో నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే వుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని భావిస్తున్న రెండు పార్టీల అధినేతలు మార్పులదిశగా ఆలోచన చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.