Begin typing your search above and press return to search.
లైంగిక దాడుల కేసుల్లో ఈ ఆదేశాలు పాటించాల్సిందే .. సుప్రీం గైడ్ లైన్స్ !
By: Tupaki Desk | 19 March 2021 1:30 PM GMTఈ మద్యకాలంలో మహిళలు,చిన్నారులపై లైంగిక దాడుల కేసులకు సంబంధించి కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాంబే హైకోర్టు ఈ ఏడాది ఇచ్చిన రెండు తీర్పులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దుస్తుల పైనుంచి బాలిక స్తనాలను తాకినంత మాత్రాన పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేమని, ఒక చేత్తో బాలిక చేయి పట్టుకుని,మరో చేత్తో ప్యాంట్ జిప్ ఓపెన్ చేసినంత మాత్రాన దాన్ని కూడా పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేమని రెండు వేర్వేరు కేసుల్లో బాంబే హైకోర్టు తీర్పులిచ్చింది. ఈ తీర్పులపై సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసుల విషయంలోనే కాదు, మహిళలపై లైంగిక దాడుల కేసుల విచారణలో న్యాయమూర్తులు,న్యాయవాదులు సున్నితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అంతేకాదు,లైంగిక దాడుల కేసుల విచారణలో ఎలా వ్యవహరించాలో చెప్తూ కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. న్యాయమూర్తులు అన్ని దశల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు... టీచర్లు,మేదోవర్గం నాయకుల్లాగా.. కాబట్టి మాటల్లోనూ,చేతల్లోనూ అన్ని సందర్భాల్లో వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒకవేళ వారు అలా వ్యవహరించకపోతే బాధితులకు దారుణమైన కౄరత్వాన్ని కలిగించినవారవుతారు అని సుప్రీం కోర్టు వెల్లడించింది.
లైంగిక దాడులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలతో పాటు న్యాయమూర్తులు,న్యాయవాదులకు లింగ సున్నితత్వంపై శిక్షణా మాడ్యూల్స్ రూపొందించాలని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేత్రుత్వంలోని సుప్రీం బెంచ్ ఎన్ జేఏ, బిసిఐను కోరింది. లైంగిక దాడుల కేసుల విచారణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలని ఒకసారి చూస్తే .. బెయిల్ షరతుల్లో నిందితుడికి, బాధితురాలికి మధ్య సంబంధాన్ని తప్పనిసరి చేయకూడదు. ఒకవేళ బాధితురాలికి నిందితుడి నుంచి హాని పొంచి ఉందని కోర్టు భావిస్తే, లేదా పోలీస్ నివేదికలో ఆ విషయంలో వెల్లడైతే, అప్పుడు బాధితురాలికి కల్పించాల్సిన రక్షణపై ప్రత్యేక జాగ్రత్త తీసుకుని, అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలి. లైంగిక దాడి కేసుల్లో నిందితుడికి బెయిల్ రాగానే , కేసు పెట్టిన మహిళకు వెంటనే ఆ సమాచారమివ్వాలి. రెండు రోజుల్లో ఆ బెయిల్ ఆర్డర్ కాపీని వారికి అందించాలి.
లైంగిక దాడి కేసుల్లో ఉత్తర్వులు, బెయిల్ పితృస్వామ్య భావనలను ప్రతిబింబించకూడదు. దుస్తులు, ప్రవర్తన,నైతికత వంటి అంశాలను ప్రాసిక్యూటర్ బెయిల్ విషయంలో ప్రస్తావించరాదు. లింగ సంబంధిత నేరాల్లో తీర్పులు చెప్పేటప్పుడు బాధితులతో నిందితుల వివాహం లేదా ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వాన్ని,రాజీ ధోరణిని సూచించడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు, సూచించకూడదు. న్యాయమూర్తులు అన్నివేళలా సున్నితత్వాన్ని ప్రదర్శించాలి. అలాగే బాధితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పదాలను ఉపయోగించకూడదు. మహిళలు భౌతికంగా బలహీనులు వారికి రక్షణ అవసరం,మహిళలకు శక్తి సామర్థ్యం తక్కువ... వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు,పురుషులే ఇంటికి యజమానులు.. కాబట్టి కుటుంబ నిర్ణయాలన్నీ వారే తీసుకోవాలి,మన సంస్కృతీ సంప్రాదాయాల ప్రకారం మహిళలు అణిగిమణిగి ఉండాలి,రాత్రిపూట ఒంటరిగా వెళ్లినందుకే లేదా అలాంటి దుస్తుల వల్లే దాడి జరిగింది.. ఇలాంటి వ్యాఖ్యలు అసలు చేయరాదు అని తెలిపింది.