Begin typing your search above and press return to search.

ఈ నొప్పులు ఎక్కువగా ఉంటే జాగ్రత్త... గుండె పోటుకు అవే సంకేతాలు

By:  Tupaki Desk   |   13 Dec 2021 12:03 PM IST
ఈ నొప్పులు ఎక్కువగా ఉంటే జాగ్రత్త... గుండె పోటుకు అవే సంకేతాలు
X
భారత్లోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ఉండే అన్నీ దేశాల్లో గుండె జబ్బులతో బాధపడే వారి నానాటికి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ జబ్బు బారిన పడుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. దీనిని బట్టి చూస్తే.. రానున్న రోజులు మరింత దుర్భలంగా మారనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా ఈ గుండె సమస్యలకు కారణం రోజు రోజుకు దిగజారి పోతున్న మన జీవన శైలి. వేళకు భోజనం చేయకుండా ఉండడం, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్, బాడీకి సరైన వ్యాయామం లేకపోవడం లాంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

దీంతో గుండె పోటు బారిన పడే వారి సంఖ్య మరింత ఎక్కువైందని వైద్యులు చెప్తున్నారు. సరైన జీవన సరళి ఉంటే గుండెను జాగ్రత్తగా రక్షించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ఈ జబ్బున పడే వారు మరీ ఎక్కువ అయినట్లు ఓ సర్వే స్పష్టం చేసింది. గంటల తరబడి ఇండ్లలోనే ఉండి పోవడం, వర్క్ ఫ్రం హోంలు ఎక్కువ కావడం, సరైన వ్యయామానికి మొగ్గు చూపకపోవడం లాంటివి ఎక్కువ కావడంతో రెండేళ్లలో మరీ ఎక్కువ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెప్తున్నారు.

ఇదిలా ఉంటే మన జీవన శైలీ, తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉండే గుండె నొప్పి.. ఎవరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అనేది తెలియదు. హఠాత్తుగా వచ్చే ఈ నొప్పి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి వెంటనే ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది.

కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే నిపుణుల చెప్తున్న దాని ప్రకారం.. గుండె పోటు వచ్చేటప్పుడు కొన్ని శరీర భాగాల్లో నొప్పి వస్తుంది. ఇది హార్ట్ అటాక్ రాబోతుందని అని చెప్పడానికి ముందస్తు సూచన అని అంటున్నారు. ఏఏ భాగాల్లో ఎక్కువగా నొప్పి వస్తుందనేది ఓ సారి తెలుసుకుందాం.

గుండె నొప్పి వచ్చే ముందుగా మన ఛాతి భాగంలో విపరీతమైన నొప్పి వస్తుందని నిపుణలు చెప్తున్నారు. ఇది రాబోయే గుండె నొప్పిని సూచిక అని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ముందుగా డాక్టర్ ను సంప్రదించడం అని సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. గుండెనొప్పి వచ్చే సమయంలో ఛాతి దగ్గర తీవ్ర అసౌకర్యం ఉంటుందని తెలిపింది.

ఎడమ చేయి నొప్పిగా అనిపించడం కూడా గుండె నొప్పిలో భాగమే అని వైద్యులు చెప్తున్నారు. ఇది వచ్చే ముందు వీపరీతంగా ఎడమ చేయి లాగుతున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. అంతేగాకుండా భుజాలు లాగడం కూడా జరుగుతుందని అంటున్నారు. వీటితో పాటు కొన్ని సార్లు కళ్లు తిరిగినట్లు ఉండడం, వాంతులు కావడం కూడా ఇందులో భాగమే అని చెప్తున్నారు. మరి కొన్ని సార్లు ఏమీ లేకుండా కూడా హార్ట్ స్టోక్ రావచ్చు. దీనిని సైలెంట్ అటాక్ అని పిలుస్తారని నిపుణులు చెప్తున్నారు.